flipkart big deal get 65 inch smart tv only at 50 inch tv price range
ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ డీల్ అనౌన్స్ చేసింది. బిగ్ డీల్ అంటే నిజంగా బిగ్ డీల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే, కేవలం 50 ఇంచ్ స్మార్ట్ టీవీ రేటుకే 65 ఇంచ్ 4K Smart TV అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది. బడ్జెట్ ధరలో పెద్ద స్మార్ట్ టీవీ కొనడానికి ఎదురు చూస్తున్న వారు ఈ డీల్ ను పరిశీలించవచ్చు.
MOTOROLA ఇండియన్ మార్కెట్లో EnvisionX సిరీస్ నుంచి అందించిన 65 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (65UHDGDMBSXP) పై ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 39% డిస్కౌంట్ తో రూ. 38,499 ధరతో ఫ్లిప్ కార్ట్ నుంచి లిస్ట్ చేయబడింది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీని HDFC డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 2,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది.
పైన తెలిపిన రెండు ఆఫర్స్ తో ఈ మోటోరోలా 65 ఇంచ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 35,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ మోటోరోలా స్మార్ట్ టీవీ స్పెక్స్ మరియు ఫీచర్స్ ఈ క్రింద చూడవచ్చు.
Also Read: వైర్లెస్ సబ్ ఉఫర్ తో వచ్చే Dolby Audio Soundbar ని 5 వేలకే అందుకోండి.!
ఈ మోటోరోలా స్మార్ట్ టీవీ 65 ఇంచ్ LED స్క్రీన్ ను 4K రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR 10 సపోర్ట్ మరియు 6 డిస్ప్లే మోడ్స్ తో ఆకట్టుకునే విజువల్ అందిస్తుంది. ఈ టీవీ మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ Google TV OS పై నడుస్తుంది మరియు నెట్ ఫ్లిక్స్, జియో హాట్ స్టార్, ప్రైమ్ వీడియో వంటి అన్ని OTT యాప్స్ కి సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ మోటోరోలా 65 ఇంచ్ స్మార్ట్ టీవీ Dolby Audio, Dolby Digital మరియు 7 సౌండ్ మోడ్స్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ టోటల్ 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ తో సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీని ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 35 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది.