ఫ్లిప్ కార్ట్ సేల్ బెస్ట్ 43 ఇంచ్ 4K Smart Tv డీల్ పై ఒక లుక్కేద్దామా.!

Updated on 04-Jul-2025
HIGHLIGHTS

స్మార్ట్ టీవీ తీక్షణంగా వెతుకుతున్న వారికి ఫ్లిప్ కార్ట్ గొప్ప డీల్స్ ఈరోజు అందించింది

ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి ఈ డీల్ ను అందించింది

43 ఇంచ్ 4K Smart Tv కేవలం 16 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది

బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్ టీవీ తీక్షణంగా వెతుకుతున్న వారికి ఫ్లిప్ కార్ట్ గొప్ప డీల్స్ ఈరోజు అందించింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి ఈ డీల్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందించిన ఈ ఆఫర్ తో 43 ఇంచ్ 4K Smart Tv కేవలం 16 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. మరి ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ బెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేద్దామా.

ఫ్లిప్ కార్ట్ సేల్ 43 ఇంచ్ 4K Smart Tv ఆఫర్ ఏమిటి?

CooCaa రీసెంట్ గా విడుదల చేసిన 43 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 43Y73 టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 54% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 17,499 రూపాయల ధరతో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీని BOBCARD EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా ఫ్లిప్ కార్ట్ ద్వారా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ ని కేవలం రూ. 15,999 ఆఫర్ రేటుకే లభిస్తుంది.

Also Read: iQOO 13 Ace Green లాంచ్ అయ్యింది: ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

CooCaa 43 ఇంచ్ 4K Smart Tv : ఫీచర్లు

ఈ కూకా స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 43 ఇంచ్ LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది, ఇందులో 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10+ సపోర్ట్ మరియు కమెళియన్ ఎక్స్ట్రీమ్ AI PQ ఇంజిన్ తో వస్తుంది మరియు మంచి విజువల్స్ అందిస్తుంది.

ఈ కూకా స్మార్ట్ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ టోటల్ 30W సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది. ఈ కూకా స్మార్ట్ టీవీ HDMI, USB, బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ గూగుల్ టీవీ OS పై నడుస్తుంది మరియు చక్కని ఫ్రేమ్ లెస్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :