flipkart announced huge deals on samsung 55 inch smart tv
Samsung బిగ్ Smart Tv పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. శాంసంగ్ యొక్క ఫేమస్ స్మార్ట్ టీవీ సిరీస్ క్రిస్టల్ 4K విజన్ ప్రో సిరీస్ 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ పై ఈ జబర్దస్త్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఫ్లిప్ కార్ట్ ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ పై ప్రకటించిన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈ టీవీ ఎన్నడూ చూడనంత అతి తక్కువ ధరలో సేల్ కి అందుబాటులోకి వచ్చింది. శాంసంగ్ పెద్ద బ్రాండ్ స్మార్ట్ టీవీని ఆఫర్ ధరలో కొనాలని సెర్చ్ వారికి ఇది గొప్ప డీల్ అవుతుంది.
శాంసంగ్ క్రిస్టల్ 4K విజన్ ప్రో సిరీస్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీని ఈరోజు 51% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 29,999 ఆఫర్ ధరలో ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. కేవలం ఈ డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ టీవీ పై అధినాపి బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందించింది. అదేమిటంటే, ఈ స్మార్ట్ టీవీని బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే వారికి రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందించింది.
ఈ ఆఫర్ తో ఈ శాంసంగ్ బిగ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 28,249 రూపాయల అతి తక్కువ ధరలో మీకు లభిస్తుంది. ఈ టీవీ యొక్క 2024 మోడల్ పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందించింది. అయితే, ఈ టీవీ మోడల్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
Also Read: Philips Dolby సౌండ్ బార్ పై బిగ్ డీల్స్ అందించిన ఫ్లిప్ కార్ట్.. ఆఫర్ ప్రైస్ ఎంతంటే.!
ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ LED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 50 Hz కలిగి ఉంటుంది. ఈ టీవీ శాంసంగ్ స్మార్ట్ టీవీల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన క్రిస్టల్ ప్రోసెసర్ 4K తో పని చేస్తుంది. అంతేకాదు, ఈ టీవీ HDR10+, 4K అప్ స్కేలింగ్, పర్ కలర్ మరియు మెగా కాంట్రాస్ట్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో మీకు గొప్ప విజువల్స్ ఆఫర్ చేస్తుంది.
ఈ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మంచి సౌండ్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ అడాప్టివ్ సౌండ్, Q-Symphony మరియు ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫీచర్స్ తో ఈ స్మార్ట్ టీవీ గొప్ప సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి టోటల్ 20W సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB, మరియు ఈథర్నెట్ పోర్ట్ తో సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. అదనంగా, ఈ టీవీ 100 కంటే ఎక్కువ ఉచిత చానల్స్ ఆఫర్ చేసే శాంసంగ్ టీవీ ప్లస్ సపోర్ట్ తో వస్తుంది.