best 65 inch smart tv deals under rs 40000 in india
భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరలో లభిస్తున్న బెస్ట్ 65 ఇంచ్ QLED Smart TV డీల్స్ ఈరోజు చూడనున్నారు. అందమైన ఇంటికి తగిన లుక్ అందించే డిజైన్ తో పాటు మంచి విజువల్స్ మరియు సౌండ్ అందించే విధంగా ఈ స్మార్ట్ టీవీలు ఉంటాయి. మీ ఇంటికి తగిన పెద్ద 65 ఇంచ్ స్మార్ట్ టీవీని 40 వేల రూపాయల బడ్జెట్ ధరలో కొనడానికి సెర్చ్ చేస్తుంటే, ఈరోజు ఆన్లైన్ లో అందుబాటులో ఉన్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ పై ఒక లుక్కేయండి.
ఈరోజు ఆన్లైన్ లో మూడు 65 ఇంచెస్ స్మార్ట్ టీవీలు గొప్ప డిస్కౌంట్ తో కేవలం 40 వేల రూపాయల ధరలోనే లభిస్తున్నాయి. ఈ మూడు స్మార్ట్ టీవీలు కూడా మంచి ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా 40 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తాయి. అందుకే ఈ మూడు స్మార్ట్ టీవీ డీల్స్ అందిస్తున్నాను. ఈ మూడు డీల్స్ కూడా ఈరోజు కార్ట్ నుంచి అందుబాటులో ఉన్నాయి.
ఈ కొడాక్ 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ (65MT5033) ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 50% డిస్కౌంట్ తో రూ. 41,999 ధరలో లభిస్తుంది. ఈ టీవీని ఫ్లిప్ కార్ట్ నుంచి HDFC మరియు BOBCARD EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ రూ. 40,499 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ టీవీ డాల్బీ విజన్, HDR 10+ సపోర్ట్ తో మంచి విజువల్స్ మరియు డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ ను అందిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ WiFi తో సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్స్ కలిగి ఉంటుంది.
ఈ బ్లౌపంక్ట్ (65QD7030) స్మార్ట్ టీవీ 60W హెవీ సౌండ్ అవుట్ పుట్ తో వస్తుంది మరియు డాల్బీ అట్మాస్ మరియు డీటీఎస్ సపోర్ట్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR మరియు HLG సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది మరియు బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ వంటి కంప్లీట్ కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 50% భారీ డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ తో కలుపుకొని కేవలం రూ. 40,499 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది.
Also Read: ZEBRONICS 5.1 Dolby soundbar పై ఫ్లిప్ కార్ట్ జబర్దస్త్ డీల్స్ అందుకోండి.!
ఈ రియల్ మీ టెక్ లైఫ్ (65UHDGQRVSAQ) స్మార్ట్ టీవీ కూడా ఈరోజు 55% డిస్కౌంట్ మరియు రూ. 1,500 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో కలుపుకొని కేవలం రూ. 40,499 ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ టీవీ క్యూలెడ్ ప్యానల్, డాల్బీ విజన్ మరియు డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ మరియు సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.