best 65 inch 4K Smart TV deal before Flipkart Buy Buy 2025 Sale
2025 ఇయర్ ఎండ్ సందర్భంగా Flipkart Buy Buy 2025 Sale అందించింది. ఈ సేల్ నుంచి ఎప్పుడు చూడని భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించబోతున్నట్లు చెబుతోంది. అయితే, ఈ సేల్ ఈరోజు రాత్రి నుంచి స్టార్ట్ అవుతుండగా, ఈ సేల్ కంటే ముందే ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ రివీల్ చేసింది. ఈ సేల్ నుంచి 55 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ 4K Smart TV అందుకునే అవకాశం యూజర్లకు అందించింది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లభిస్తున్న ఈ బెస్ట్ 65 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేద్దామా.
రియల్ మీ టెక్ లైఫ్ లేటెస్ట్ 65 ఇంచ్ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ సేల్ కంటే ముందే 55 ఇంచ్ టీవీ రేటుకే అందుకోవచ్చు. ఎందుకంటే, ఈరోజు ఈ స్మార్ట్ టీవీ పై 57% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 33,999 రూపాయల ఆఫర్ ధరలో ఆఫర్ చేసింది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై ICICI బ్యాంక్ క్రెడిట్ రూ. 1,500 అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.
పైన తెలిపిన ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం 32,499 రూపాయల అతి తక్కువ ధరలో అందుకోవచ్చు. సాధారణంగా 33 వేల రూపాయల ధరలో 55 ఇంచ్ స్మార్ట్ టీవీలు లభిస్తుండగా, ఈరోజు మీరు ఫ్లిప్ కార్ట్ నుంచి ఈ రియల్ మీ టెక్ లైఫ్ 65 ఇంచ్ స్మార్ట్ టీవీని మీ సొంతం చేసుకోవచ్చు.
Also Read: Realme P4x 5G: 7000 mAh బిగ్ టైటాన్ బ్యాటరీతో బడ్జెట్ ధరలో లాంచ్ అయ్యింది.!
ఈ రియల్ మీ టెక్ లైఫ్ స్మార్ట్ టీవీ 65 ఇంచ్ A+ గ్రేడ్ LED ప్యానల్ కలిగి ఉంటుంది మరియు ఈ ప్యానల్ 4K UHD రిజల్యూషన్ తో ఉంటుంది. ఈ టీవీ 2 జీబీ ర్యామ్ మరియు 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఇది గూగుల్ టీవీ OS 5.0 ఆపరేటింగ్ సిస్టం పై నడుస్తుంది. ఇందులో ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్, యూట్యూబ్ మరియు జియో హాట్ స్టార్ వంటి చాలా యాప్స్ కి సపోర్ట్ ఉంది.
సౌండ్ పరంగా, ఈ రియల్ మీ టెక్ లైఫ్ స్మార్ట్ టీవీ డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్ సెటప్ కలిగి ఉంటుంది. ఈ టీవీ టోటల్ 30W సౌండ్ మీకు అందిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB, ఆప్టికల్, ఈథర్నెట్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్ టీవీ కోరుకునే వారు ఈరోజు లభిస్తున్న ఈ స్మార్ట్ టీవీ డీల్ ను పరిశీలించవచ్చు.