best 55 inch QLED Smart Tv deal under rs 28000 today
బడ్జెట్ ధరలో ఇంటికి తగిన పెద్ద 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి ఈరోజు ఒక మంచి ఆఫర్ అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ నుంచి లభిస్తున్న ఈ ఆఫర్ ద్వారా కేవలం 28 వేల రూపాయల కంటే తక్కువ ధరలోనే ఈ 55 ఇంచ్ స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. ఇండియన్ మార్కెట్లో రీసెంట్ గా విడుదలైన ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ నుంచి మంచి బడ్జెట్ ధరకే లభిస్తుంది. అందుకే, ఈ డీల్ ని ఈ రోజు ప్రత్యేకంగా అందించాను.
Kodak యొక్క లేటెస్ట్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ 50% భారీ డిస్కౌంట్ అందించాయి. ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 29,499 డిస్కౌంట్ ధరకే లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ నుంచి HDFC బ్యాంకు లేదా అమెజాన్ నుంచి Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ. 27,999 రూపాయల ధరలో ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ నుంచి లభిస్తుంది.
ఈ కోడాక్ స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్ కలిగిన 55 ఇంచ్ క్యూలెడ్ ప్యానల్ ను 60Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ డాల్బీ విజన్ మరియు HDR 10+ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో నడుస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ తో పాటు 16 జీబీ అంతర్గత మెమరీ కలిగి ఉంటుంది. ఈ టీవీ ప్రీమియం మరియు స్లీక్ డిజైన్ తో కూడా ఆకట్టుకుంటుంది.
ఈ ఫోన్ డాల్బీ అట్మాస్ మరియు డీటీఎస్ రెండు సౌండ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఈ టీవీ టోటల్ 40W సౌండ్ అందించే రెండు స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, ఈథర్నెట్, బిల్ట్ ఇన్ క్రోమ్ క్యాస్ట్, HDMI, USB, బ్లూటూత్ మరియు AV ఇన్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
Also Read: మీరు ఏమి చేయకుండా మీ ఫోన్ కొత్త సెట్టింగ్స్ తో కనిపిస్తోందా.. కారణం తెలుసుకోండి.!
ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ నుంచి ఈ ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.4 స్టార్ రేటింగ్, అమెజాన్ యూజర్ల నుంచి 4.2 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలను అందుకుంది.