Smart Tv Offer: భారీ డిస్కౌంట్ తో 6 వేలకే లభిస్తున్న బ్రాండ్ న్యూ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ ను ఈరోజు మళ్ళి ప్రకటించింది

Smart Tv Offer స్మార్ట్ టీవీ డీల్ ను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది

6 వేల రూపాయల బడ్జెట్ లోనే బ్రాండ్ న్యూ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ మీ సొంతం చేసుకోవచ్చు

Smart Tv Offer: ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ ను ఈరోజు మళ్ళి ప్రకటించింది. ఈరోజు నుంచి మొదలైన ఈ సేల్ అక్టోబర్ 17వ తేదీ తో ముగుస్తుంది. ఈ సేల్ నుంచి ఈరోజు బెస్ట్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్ ను ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. ఫ్లిప్ కార్ట్ ప్రకటించిన ఈ ఆఫర్ తో కేవలం 6 వేల రూపాయల బడ్జెట్ లోనే బ్రాండ్ న్యూ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ మీ సొంతం చేసుకోవచ్చు.

ఏమిటా Smart Tv Offer ?

ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Daiwa ఇటీవల ఇండియన్ మార్కెట్లో లో లాంచ్ చేసిన 32 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఈ ఆఫర్ ను అందించింది. ఆఫర్ విషయానికి వస్తే, డైవా 32 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ ‘D32H1COC’ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు సేల్ నుంచి 61% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 6,999 ధరకే సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీ పై 10% బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ ఈ సేల్ నుంచి ఆఫర్ చేస్తోంది.

ఈ డైవా స్మార్ట్ టీవీని BOBCARD, YES బ్యాంక్ మరియు Axis బ్యాంక్ కార్డ్స్ తో ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి కొనుగోలు చేసే యూజర్లకు ఈ 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ టీవీ పై రూ. 699 రూపాయల డిస్కౌంట్ అందుకోవచ్చు మరియు ఈ టీవీ ని కేవలం రూ. 6,300 రూపాయల అతి తక్కువ ధరకు మీ సొంతం చేసుకోవచ్చు.

ఈ ఆఫర్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, 24 ఇంచ్ టీవీ రేటుకే 32 ఇంచ్ స్మార్ట్ టీవీని అందుకోవచ్చు. ఈ రేటులో ఈ టీవీ ఆఫర్ చేసే ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం.

Also Read: POCO F6 5G: పోటీ లేని డిస్కౌంట్ ధరకు లభిస్తున్న పోకో పవర్ ఫుల్ 5జి ఫోన్.!

Daiwa 32 inch Smart Tv : ఫీచర్స్

ఈ డైవా 32 ఇంచ్ స్మార్ట్ టీవీ HD Ready అంటే 1366 x 768 రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 512 MB ర్యామ్ తో పాటు 4 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ ఫ్రేమ్ లెస్ డిజైన్ Eye Care మోడ్ తో వస్తుంది.

ఈ డైవా స్మార్ట్ టీవీ లో 20 W సౌండ్ అవుట్ పుట్ అందించే స్పీకర్లను సరౌండ్ సౌండ్ మరియు ఈక్వలైజర్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ ఇన్ బిల్ట్ Wi-Fi, HDMI, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :