best 32 inch smart tv deals under 7k from flipkart
భారీ డిస్కౌంట్ తో 7 వేల బడ్జెట్ లో లభిస్తున్న బెస్ట్ 32 ఇంచ్ Smart TV డీల్స్ ఈరోజు చూడనున్నాము. కేవలం 7 వేల రూపాయల బడ్జెట్ లో కొత్త స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారికి ఈరోజు అందుబాటులో ఉన్న బెస్ట్ డీల్స్ అందిస్తున్నాము. ఈరోజు ఈ డీల్స్ ను ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది మరియు ఈ టీవీలు మంచి ఫీచర్స్ కూడా కలిగి ఉంటాయి. ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన ఈ స్మార్ట్ టీవీ డీల్స్ ఏమిటో చూద్దామా.
ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి రెండు స్మార్ట్ టీవీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో, ఒకటి Coocaa బ్రాండ్ 32 ఇంచ్ స్మార్ట్ కాగా రెండవది Thomson స్మార్ట్ టీవీ. ఈ రెండు స్మార్ట్ టీవీ లపై ఫ్లిప్ కార్ట్ అందించిన డీల్స్ మరియు ఈ టీవీ ఫీచర్స్ ఇప్పుడు చూద్దాం.
కూకా 32 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (32S3U Plus) ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 7,499 ధరకే లభిస్తోంది. ఈ టీవీని SBI, Axis మరియు BOBCARD EMI క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 749 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీని కేవలం రూ. 6,750 ధరకే అందుకోవచ్చు. Buy From Here
ఈ కూకా స్మార్ట్ టీవీ 32 ఇంచ్ HD Ready రిజల్యూషన్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 4GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది మరియు Coolita OS తో పని చేస్తుంది. ఈ టీవీ Dolby Audio సౌండ్ సపోర్ట్, 30W సౌండ్ అవుట్ పుట్ మరియు అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
Also Read: JBL Tune Series నుంచి మూడు కొత్త బడ్స్ లాంచ్: ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!
థాంసన్ ఆల్ఫా 32 ఇంచ్ స్మార్ట్ టీవీ HD Ready రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 46% డిస్కౌంట్ తో రూ. 7,999 ధరకే లభిస్తోంది. ఈ టీవీని SBI, Axis మరియు BOBCARD EMI క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 799 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ టీవీని కేవలం రూ. 7,200 రూపాయలకే పొందవచ్చు.
ఈ థాంసన్ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో వస్తుంది మరియు 4GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ కూడా 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 30W సౌండ్ అందించే బాక్స్ స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కూడా కలిగి ఉంటుంది.