Samsung Smart Tv పై సూపర్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించిన అమెజాన్.!

HIGHLIGHTS

Samsung Smart Tv పై ఈరోజు అమెజాన్ ఇండియా సూపర్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది

భారీ కూపన్ డిస్కౌంట్ మరియు భారీ బ్యాంక్ డిస్కౌంట్ రెండు ఆఫర్లు అందించింది

రెండు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో లేటెస్ట్ బిగ్ స్మార్ట్ టీవీ మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది.

Samsung Smart Tv పై ఈరోజు అమెజాన్ ఇండియా సూపర్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. బ్రాండ్ న్యూ స్మార్ట్ టీవీ డీల్స్ చూసే వారిలో మీరు కూడా ఉంటే ఈరోజు అమెజాన్ అందించిన ఈ బెస్ట్ డీల్ ను చూడవచ్చు. ఎందుకంటే, అమెజాన్ ఈరోజు శాంసంగ్ లేటెస్ట్ 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ పై భారీ కూపన్ డిస్కౌంట్ మరియు భారీ బ్యాంక్ డిస్కౌంట్ రెండు ఆఫర్లు అందించింది. ఈ రెండు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో లేటెస్ట్ బిగ్ స్మార్ట్ టీవీ మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది.

Samsung Smart Tv : ఆఫర్ ఏమిటి?

శాంసంగ్ గత సంవత్సరం Crystal 4K Vista Pro సిరీస్ నుంచి విడుదల చేసిన 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ టీవీని రూ. 43,990 ఆఫర్ ధరలో లిస్ట్ చేసిన అమెజాన్ ఈ టీవీ పై ఏకంగా రూ. 4,000 భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీని Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

అమెజాన్ ఈరోజు ఈ శాంసంగ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై అందించిన అన్ని ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 38,740 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Buy From Here

Also Read: రెండు ఫేమస్ ZEBRONICS Dolby సౌండ్ బార్స్ పై ఫ్లిప్ కార్ట్ సమ్మర్ సేల్ బిగ్ డిస్కౌంట్.!

Samsung Smart Tv : ఫీచర్స్

ఇది శాంసంగ్ అందించిన 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మరియు గొప్ప LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 50Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ క్రిస్టల్ ప్రోసెసర్ 4K తో నడుస్తుంది మరియు HDR10+, పర్ కలర్, 4K అప్ స్కేలింగ్ మరియు HLG వంటి మరిన్ని ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది.

ఈ స్మార్ట్ టీవీ Q-Symphony, అడాప్టివ్ సౌండ్, ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ మరియు బ్లూటూత్ ఆడియో వంటి సౌండ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ టీవీ డ్యూయల్ స్పీకర్లు కలిగి టోటల్ 20W సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ అలెక్సా మరియు బిక్స్ బై సపోర్ట్ తో వస్తుంది. ఇందులో బిల్ట్ ఇన్ Wi-Fi, HDMI, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కూడా ఉన్నాయి.

ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ 4 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అమెజాన్ యూజర్ల నుంచి రిసీవ్ చేసుకుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :