amazon offers big deals on Soundbar Smart TV
అమెజాన్ ఇండియా ఈరోజు గొప్ప డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. మంచి సౌండ్ మరియు గొప్ప విజువల్స్ అందించే లేటెస్ట్ Soundbar Smart TV పై ఈ బిగ్ డీల్స్ అందించింది. ఇందులో పవర్ ఫుల్ సౌండ్ అందించే బిల్ట్ ఇన్ సౌండ్ బార్ ఉంటుంది. 20 వేల బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్ టీవీ కోసం సెర్చ్ చేస్తున్న వారు ఈరోజు అమెజాన్ నుంచి అందుబాటులో ఉన్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ని పరిశీలించవచ్చు.
బిల్ట్ ఇన్ సౌండ్ బార్ తో Vu Vibe Series నుంచి అందించిన 43 ఇంచ్ లేటెస్ట్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి 42% డిస్కౌంట్ తో కేవలం రూ. 23,190 ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీని Yes బ్యాంక్, IDFC First మరియు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డు తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,500 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ మొత్తం ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 21,690 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చు. Buy From Here
Also Read: boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ పై అతి భారీ డిస్కౌంట్ అందుకోండి.!
ఇది సౌండ్ మరియు విజువల్స్ రెండిటి కలయిక తో వచ్చే స్మార్ట్ టీవీ. ఇందులో 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840×2160) రిజల్యూషన్ కలిగిన 43 ఇంచ్ A+ గ్రేడ్ QLED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, డాల్బీ విజన్, HDR10 మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఇది డైనమిక్ బ్యాక్ లైట్ కంట్రోల్ యాక్టివ్ కాంట్రాస్ట్ మరియు AI పిక్చర్ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ Vu స్మార్ట్ టీవీ 1.5GHz Vu On AI ప్రోసెసర్ తో నడుస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ తో పాటు 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ టీవీ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన ఇంటిగ్రేటెడ్ బిల్ట్ ఇన్ సౌండ్ బార్ తో వస్తుంది. ఈ టీవీ టోటల్ 88W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ డైలాగ్ క్లారిటీ మరియు డీప్ బాస్ సౌండ్ అందించడమే కాకుండా ఆడియో ఓన్లీ ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, HDMI, USB, AV ఇన్, ఆప్టికల్, ఈథర్నెట్ వంటి మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ అమెజాన్ ఇండియా యూజర్ల నుంచి 4.3 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది.