Amazon Sale: లాస్ట్ మినిట్ లో Panasonic స్మార్ట్ టీవీ పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్.!

HIGHLIGHTS

Amazon GFF Sale 2024 లాస్ట్ మినిట్ డీల్

లేటెస్ట్ పానాసోనిక్ బిగ్ స్మార్ట్ టీవీ పై ధమాకా ఆఫర్

పానాసోనిక్ పెద్ద స్మార్ట్ టీవీ మరింత తక్కువ ధరకు లభిస్తుంది

Amazon Sale : ఇంకో గంటలో అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ 2024 ముగుస్తుందనగా లేటెస్ట్ పానాసోనిక్ బిగ్ స్మార్ట్ టీవీ పై ధమాకా ఆఫర్ ని అందించింది. గంటలో ముగియనున్న ఈ అమెజాన్ సేల్ నుంచి ఈ స్మార్ట్ టీవీ ని మంచి డిస్కౌంట్ మరియు బ్యాంక్ డిస్కౌంట్ తో కలుపుకొని తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.

Amazon Sale: Panasonic స్మార్ట్ టీవీ ఆఫర్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుంచి పానాసోనిక్ యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ TH-55MX660DX ను చివరి నిమిషంలో 32% డిస్కౌంట్ తో రూ. 42,990 రూపాయల డిస్కౌంట్ ధరకే అందించడం జరిగింది. ఈ స్మార్ట్ టీవీ పైన రూ. 1,500 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అమెజాన్ ఆఫర్ చేస్తోంది.

SBI బ్యాంక్ కార్డ్స్ తో ఈ పానాసోనిక్ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసే యూజర్లకు ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ పానాసోనిక్ పెద్ద స్మార్ట్ టీవీ మరింత తక్కువ ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ని అన్ని ఆఫర్లతో చవక ధరలో కొనడానికి Buy From Here పైన నొక్కండి

Also Read: Amazon GFF Sale నుంచి 8 వేల ధరలో పెద్ద స్మార్ట్ టీవీ అందుకునే ఛాన్స్.!

Panasonic (55) 4K UHD: ఫీచర్స్

ఈ పానాసోనిక్ 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ 4K కలర్ ఇంజిన్ మరియు HDR 10+ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ హెక్సా క్రోమా డ్రైవ్ మరియు MirAIe ఫీచర్ తో మరింత ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ టీవీ 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ లతో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ లో 3 HDMI, 2 USB, బ్లూటూత్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi వంటి కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.

ఈ పానాసోనిక్ 4K స్మార్ట్ టీవీ లో 20W సౌండ్ అందించే రెండు పవర్ ఫుల్ స్పీకర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్ టీవీ Dolby Digital మరియు Audio Boost Plus ఫీచర్లతో మంచి సౌండ్ ను అందిస్తుంది. ఈ పానాసోనిక్ స్మార్ట్ టీవీ స్లిమ్ బెజెల్స్ తో ఆకట్టుకుంటుంది మరియు 4K అప్ స్కేలింగ్ ఫీచర్ తో కూడా వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :