Amazon announced huge discount offers on LG Smart Tv
LG Smart Tv స్మార్ట్ టీవీ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్ తో బడ్జెట్ ధరలో లభిస్తోంది. ఎందుకంటే, అమెజాన్ ఇండియా ఈరోజు ఎల్ జి యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై భారీ డీల్స్ అందించింది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ ఈరోజు గొప్ప డిస్కౌంట్ ప్రైస్ తో లభిస్తుంది. ఎల్ జి యొక్క లేటెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ కోసం చూస్తుంటే, అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ డీల్ ఒక లుక్కేయండి.
LG యొక్క UR75 Series నుంచి సరికొత్తగా విడుదల చేసిన 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈరోజు డీల్స్ అందించింది. ఈ టీవీ అమెజాన్ పై ఈరోజు 39% భారీ డిస్కౌంట్ అందించి రూ. 43,990 రూపాయల ఆఫర్ ధరకు సేల్ చేస్తోంది. దీనితో పాటు రూ. 2,500 రూపాయల ప్రైమ్ డిస్కౌంట్ కూపన్ కూడా అందించింది. అయితే, ఈ కూపన్ ఆఫర్ మే 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
పైన తెలిపిన రెండు ఆఫర్లు కాకుండా ఈ ఫోన్ పై బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ టీవీ పై రూ. 2,000 రూపాయల HDFC బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ మూడు ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని రూ. 39,490 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు. Buy From Here
Also Read: WhatsApp App: వాట్సాప్ స్టేటస్ అప్డేట్ లో కొత్త ఫీచర్స్ యాడ్ చేసిన వాట్సాప్.!
ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ 55 ఇంచ్ బిగ్ LED స్క్రీన్ ను 4K రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ α5 AI Processor 4K Gen6 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు దీనికి జతగా ఈ టీవీని స్మూత్ గా నడపడానికి 1.5 GB ర్యామ్ ఉంటుంది. అంతేకాదు, మరిన్ని యాప్స్ డౌన్లోడ్ చేసి స్టోర్ చేయడానికి వీలుగా 8GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందించింది.
ఈ స్మార్ట్ ఫోన్ WebOS పై నడుస్తుంది మరియు AI ThinQ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఎల్ జి స్మార్ట్ టీవీ HDR 10 మరియు HGiG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. అంతేకాదు, AI Sound ఫీచర్ తో వర్చువల్ 5.1 సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ 20W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ 3 HDMI, 2 USB, ఆప్టికల్, ఈథర్నెట్, ఇన్ బిల్ట్ Wi-Fi మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.