Sony BRAVIA 3 Smart Tv పై భారీ తగ్గింపు ప్రకటించిన అమెజాన్.!
Sony BRAVIA 3 Smart Tv పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది
సోనీ స్మార్ట్ టీవీ పై రూ. 21,000 భారీ డిస్కౌంట్ అందుకోవచ్చు
Dolby Vision సపోర్ట్ తో అత్యంత క్లియర్ మరియు అత్యద్భుతమైన విజువల్స్ అందిస్తుంది
భారత మార్కెట్లో ఇటీవల విడుదలైన Sony BRAVIA 3 Smart Tv పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఇండియన్ మార్కెట్లో 93 వేల రూపాయల బడ్జెట్ ధరలో విడుదలైన సోనీ బ్రావియా 3 సిరీస్ 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ ఇప్పుడు అమెజాన్ నుంచి 21 వేల రూపాయల భారీ డిస్కౌంట్ అందుకుని కేవలం 73 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తుంది. అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేద్దామా.
SurveySony BRAVIA 3 Smart Tv : ఆఫర్
సోనీ బ్రావియా 3 సిరీస్ 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ ఇండియన్ మార్కెట్లో రూ. 93,990 రూపాయల ప్రైస్ తో లాంచ్ అయ్యింది. ఈ టీవీ గత సంవత్సరం జూలై నెలలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఈ టీవీ ఇప్పుడు అమెజాన్ అందించింది రూ. 18,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ తో ఇప్పుడు రూ. 75,990 ధరకే లభిస్తోంది.
ఇది మాత్రమే కాదు, ఈ సోనీ బిగ్ స్మార్ట్ టీవీ పై రూ. 3,000 రూపాయల భారీ ప్రైమ్ డిస్కౌంట్ కూపన్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ టీవీ రూ. 72,990 రూపాయల డిస్కౌంట్ ధరకు లభిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు తో కొనే వారికి రూ. 2,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ తో కోన్ వారికి రూ. 2,750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీని అమెజాన్ నుంచి 70 వేల రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. Buy From Here
Also Read: బెస్ట్ డీల్స్ తో 26 వేల బడ్జెట్లోనే బ్రాండెడ్ 55 ఇంచ్ QLED Smart tv అందుకోండి.!
Sony BRAVIA 3 Smart Tv : ఫీచర్స్
ఈ సోనీ స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 55 ఇంచ్ LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ సోనీ టీవీ 4K HDR Processor X1 తో పని చేస్తుంది. ఈ టీవీ ట్రైలుమినస్ ప్రో, 4K X-రియాలిటీ ప్రో HDR10, HLG మరియు Dolby Vision సపోర్ట్ తో అత్యంత క్లియర్ మరియు అత్యద్భుతమైన విజువల్స్ అందిస్తుంది.

ఈ సోనీ స్మార్ట్ టీవీ Dolby Atmo మరియు యాంబియంట్ ఆప్టిమైజేషన్ ఫీచర్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ రెండు ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగి 20W సౌండ్ అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. ఈ సోనీ స్మార్ట్ టీవీ ALLM/eARC, HDMI 2.1, బిల్ట్ ఇన్ మైక్, USB, బ్లూటూత్ మరియు ఇన్ బిల్ట్ Wi-Fi వంటి చాలా కనెక్టివిటీ ఫీచర్ తో వస్తుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile