కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నారా? అయితే, మీకోసం ఈరోజు ఒక బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ టీవీ డీల్ అందుబాటులో ఉంది. పెద్ద స్క్రీన్ కలిగిన బ్రాండెడ్ 55 ఇంచ్ QLED Smart tv భారీ డిస్కౌంట్ ఈరోజు 26 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే లభిస్తుంది. ఈ టీవీ మంచి ఫీచర్స్ కలిగి ఉండడమే కాకుండా ఈరోజు మంచి ఆఫర్స్ తో కూడా లభిస్తుంది. ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ఏమిటో చూద్దామా.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటా 55 ఇంచ్ QLED Smart tv?
కొడాక్ యొక్క 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (55MT5022) ఈరోజు 53% భారీ డిస్కౌంట్ తో రూ. 27,999 ఆఫర్ ధరతో ఫ్లిప్ ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ నుంచి SBI క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1,500 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని రూ. 26,499 రూపాయల రేటుకే లభిస్తుంది.
ఈ కొడాక్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన 55 ఇంచ్ QLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ కొడాక్ స్మార్ట్ టీవీ HDR 10+ మరియు HLG ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ AMO టెక్నాలాజి తో మంచి ఇంప్రూవ్డ్ కలర్స్ అందిస్తుందని కొడాక్ తెలిపింది. ఈ కొడాక్ టీవీ అంచులు లేని డిజైన్ తో వస్తుంది.
ఈ కొడాక్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ Dolby Digital Plus మరియు DTS సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 40W సౌండ్ అవుట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ HMDI, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఈ బిగ్ స్మార్ట్ టీవీ ఈరోజు కేవలం 26 వేల రూపాయల బడ్జెట్ ధరలోనే లభిస్తుంది.