వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు ఇక పండగే

Updated on 22-Feb-2021
HIGHLIGHTS

వోడాఫోన్ ఐడియా (Vi) కస్టమర్లకు మంచి ఛాన్స్

వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు ఉచిత హై స్పీడ్ ఇంటర్నెట్

వోడాఫోన్ ఐడియా (Vi) కస్టమర్లకు ఇక పండగే.

వోడాఫోన్ ఐడియా (Vi) కస్టమర్లకు మంచి ఛాన్స్ దొరికింది. తన యూజర్ బేస్ ని మరింత పెంచెందుకు తీసుకున్న ప్లాన్స్ లో భాగంగా వోడాఫోన్ ఐడియా కస్టమర్లకు ఉచిత హై స్పీడ్ ఇంటర్నెట్ అఫర్ చేస్తోంది. OTT ప్లాట్ఫారం పైన ఎక్కువగా కంటెంట్ ని ఎంజాయ్ చేసే వోడాఫోన్ ఐడియా (Vi) కస్టమర్లకు ఇక పండగే.     

విషయానికి వస్తే, Vi కొత్తగా చేసిన ప్రకటనలో Vi యూజర్లకు Hi-Speed డేటాని ఉచితంగా చేస్తున్నట్లు తెలిపింది. అయితే, దీనికి కొన్ని షరతులు కూడా పెట్టింది. ఈ Hi-Speed ఉచిత డేటాని యూజర్లు కేవలం రాత్రి 12 గంటల నుండి మొదలుకొని ఉదయం 6 గంటల వరకూ మాత్రమే వాడుకునే వీలుంటుంది. అంతేకాదు, రూ. 249 రూపాయలు అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసే కస్టమర్లకు మాత్రమే ఈ ఉచిత డేటా వర్తిస్తుంది.

నేటికాలంలో, ఇంటర్నెట్ మరియు OTT లలో నైట్ బింగింగ్ పెరుగుతోంది, ప్రత్యేకించి ప్రజలు సౌకర్యవంతమైన డౌన్ లోడ్ సమయాల్లో తమ పనిని నిర్వహిస్తుంటారు మరియు ఎక్కువ సమయం తీసుకునే కంటెంట్ తో గడుపుతారు. అందుకే,కస్టమర్ల యొక్క ఈ డిమాండ్ ను తీర్చడానికి, తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఎటువంటి అదనపు ఖర్చులు లేకుండా, ఎటువంటి పరిమితులు లేకుండా హై-స్పీడ్ నైట్-టైమ్ డేటాను ఉచితంగా Vi తన యూజర్ల కోసం ప్రకటించింది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :