Jio: తక్కువ ధరలో వచ్చే ఈ ధమాకా ప్లాన్స్ గురించి తెలుసుకోండి.!

HIGHLIGHTS

రిలయన్స్ జియో యూజర్లకు తక్కువ ధరలో వచ్చే ఈ ధమాకా ప్లాన్స్ ఉన్నాయి

ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసే జియో కస్టమర్లు మరిన్ని ప్రయోజనాలను పొందుతారు

ఈ Jio ప్లాన్ మంచి లాభాలను అందిస్తాయి

Jio: తక్కువ ధరలో వచ్చే ఈ ధమాకా ప్లాన్స్ గురించి తెలుసుకోండి.!

రిలయన్స్ జియో యూజర్లకు తక్కువ ధరలో వచ్చే ఈ ధమాకా ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసే జియో కస్టమర్లు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ డేటా, డైలీ SMS సౌకర్యాలతో పాటుగా మరిన్ని ఇతర ప్రయోజనాలను కూడా పొందుతారు. బడ్జెట్ టైట్ గా ఉండి డేటా మరియు కాలింగ్ సౌలబ్యాన్ని కోరుకునే వారికి ఈ ప్లాన్ మంచి లాభాలను అందిస్తాయి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

1. Jio Rs. 149 Plan 

రిలయన్స్ జియో యొక్క చవకైన అన్లిమిటెడ్ ప్లాన్ గా ఇది చెప్పబడుతుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. అంతేకాదు, ఈ ప్లాన్ తో 1GB రోజువారీ వేగవతమైన 4G డేటా, రోజువారీ 100 SMS లను కూడా అందుకుంటారు. అలాగే, రిలయన్స్ జియో యొక్క Jio TV,JioCinema మరియు JioCloud లకు ఉచిత యాక్సెస్ ని కూడా యూజర్లు పొందుతారు. అయితే, ఈ ప్లాన్ కేవలం 20 రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.    

2. Jio Rs. 179 Plan

24 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ లాభాలతో తక్కువ ధరలో వచ్చే ప్లాన్ గా దీన్ని గురించి చెప్పవచ్చు. రిలయన్స్ జియో యొక్క ఈ Rs. 179 Plan తో రీఛార్జ్ చేసే యూజర్లు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 1GB హై స్పీడ్ 4G డేటాని మరియు డైలీ 100 SMS వినియోగ సౌలబ్యాన్ని కూడా అందుకుంటారు. ఈ ప్లాన్ కూడా Jio TV,JioCinema మరియు JioCloud లకు ఫ్రీ యాక్సెస్ ని యూజర్లు అందుకుంటారు.

3. Jio Rs. 209 Plan

జియో యొక్క బడ్జెట్ నెలవారి (28 రోజులు) ప్రీపెయిడ్ ప్లాన్ గా ఈ రూ. 209 ప్లాన్ చెప్పబడుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 1GB హై స్పీడ్ డేటా మరియు డైలీ 100 SMS ప్రయోజనాలను పొందుతారు. అలాగే, io TV,JioCinema మరియు JioCloud లకు ఫ్రీ యాక్సెస్ పొందుతారు.

పైన తెలిపి ఈ మూడు ప్రీపెయిడ్ ప్లాన్ తో పాటు వచ్చే డైలీ 1GB హై స్పీడ్ 4G డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64 Kbps కి తగ్గించ బడుతుంది మరియు అన్లిమిటెడ్ డేటా లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo