JIo Offers one year Prime Video subscription with these plan
JIo Offer: అమేజాన్ ప్రైమ్ వీడియో లను సంవత్సరం మొత్తం ఉచితంగా ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే, జియో అఫర్ చేస్తున్న బెస్ట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే, బడ్జెట్ ధరలో రిలయన్స్ జియో తీసుకు వచ్చిన బెస్ట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తిగా సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలతో పాటుగా సంవత్సరం మొత్తం Prime Video సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.
రిలియన్స్ జియో లేటెస్ట్ గా అందించిన కొత్త వన్ ఇయర్ ప్రీపెయిడ్ రూ. 3,227 ప్లాన్ గురించే ఇప్పటి వరకూ మనం మాట్లాడుకుంది. జియో అందించిన ఈ బెస్ట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే అన్ని ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: Anti-Drop డిస్ప్లేతో వస్తున్న Honor X9b స్మార్ట్ ఫోన్.!
జియో యొక్క ఈ రూ. 3,227 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ తో 365 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS ఉపయోగ ప్రయోజనం అందిస్తుంది. ఈ ప్లాన్ 5జి నెట్ వర్క్ పైన సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ 5జి డేటా ప్రయోజనం ఆ అందిస్తుంది. అదే 4G నెట్ వర్క్ పైన అయితే డైలీ 2 GB డైలీ డేటా చొప్పున 365 రోజులకు గాను 730 GB ల డేటాని అందిస్తుంది.
ఇక ఇతర ప్రయోజనాలకు వస్తే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో Prime Video Mobile Edition వన్ ఇయర్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో Jio TV, Jio Cinema మరియు Jio Cloud వంటి జియో యాప్స్ కు కూడా సంవత్సరం మొత్తం యాక్సెస్ అందిస్తుంది.