Anti-Drop డిస్ప్లేతో వస్తున్న Honor X9b స్మార్ట్ ఫోన్.!

Anti-Drop డిస్ప్లేతో వస్తున్న Honor X9b స్మార్ట్ ఫోన్.!
HIGHLIGHTS

హానర్ Anti-Drop డిస్ప్లేతో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తోంది

ఆకట్టుకునే ఫీచర్లతో లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది

అల్ట్రా-బౌన్స్ యాంటీ డ్రాప్ డిస్ప్లేతో లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది

ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ హానర్ Anti-Drop డిస్ప్లేతో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. అదే Honor X9b స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ ను అత్యంత కఠిన డిస్ప్లే మరియు బిల్డ్ క్వాలిటీతో తీసుకు వస్తున్నట్లు తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఆకట్టుకునే ఫీచర్లతో లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ముందుగా గ్లోబెల్ మార్కెట్ లో ఈ ఫోన్ ను లాంచ్ చేసిన హానర్ ఈ ఫోన్ ను ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేయడానికి సిద్దమయ్యింది.

Honor X9b

హానర్ ఎక్స్9బి స్మార్ట్ ఫోన్ 5 ఫోల్డ్ ఐ ప్రొటెక్షన్ మరియు అల్ట్రా-బౌన్స్ యాంటీ డ్రాప్ డిస్ప్లేతో లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ డిస్ప్లే 1.5 K రిజల్యూషన్ కలిగి ఉంటుంది మరియు 92.8% స్క్రీన్ టూ బాడీ రిజల్యూషన్ తో ఉంటుంది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 6 Gen 1 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో తీసుకు వస్తున్నట్లు హానర్ కన్ఫర్మ్ చేసింది. ఈ ఫోన్ Android 13 OS పైన MagicOS 7.2 తో పని చేస్తుంది.

Also Read: Redmi A3: కొత్త ప్రీమియం డిజైన్ తో వస్తున్న రెడ్ మి అప్ కమింగ్ ఫోన్.!

ఈ ఫోన్ ను ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా గొప్ప క్వాలిటీ కలిగిన టాప్ క్వాలిటీ ప్రోడక్ట్ గా ఈ ఫోన్ ను తీసుకు వస్తున్నట్లు కంపెనీ గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ కోసం అమేజాన్ ఇండియా సేల్ పార్ట్నర్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, హానర్ ఎక్స్9బి స్మార్ట్ ఫోన్ కోసం అమేజాన్ ఇండియా ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ తో టీజింగ్ చేస్తోంది.

అమేజాన్ అందించిన టీజర్ పేజ్ ద్వారా ఈ ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్స్ తో టీజింగ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్లలను కూడా ఈ పేజ్ ద్వారా ప్రకటినుంచే అవకాశం ఉండవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo