JIO ప్లాన్స్ తో 1 సంవత్సరం Disney+ Hotstar VIP సబ్ స్క్రిప్షన్ ఉచితం

HIGHLIGHTS

ఏప్రిల్ 3 న ఈ Disney+ సర్వీస్ Hotstar ద్వారా భారతదేశంలో ప్రారంభించబడింది.

JIO ఎటువంటి అదనపు రుసుము లేకుండా Disney+ Hotstar VIP సబ్ స్క్రిప్షన్ను అందిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ సబ్ స్క్రిప్షన్ విలువ 399 రూపాయలు మరియు ఇది ఒక సంవత్సరం చెల్లుతుంది.

JIO ప్లాన్స్ తో 1 సంవత్సరం Disney+ Hotstar VIP సబ్ స్క్రిప్షన్ ఉచితం

JIO తన ప్రీపెయిడ్ సబ్ స్క్రైబర్లకు ఎటువంటి అదనపు రుసుము లేకుండా Disney+ Hotstar VIP సబ్ స్క్రిప్షన్ను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సబ్ స్క్రిప్షన్ విలువ 399 రూపాయలు మరియు ఇది ఒక సంవత్సరం చెల్లుతుంది. అయితే, ఇది VIP Subscription మాత్రమే మరియు ప్రీమియం సభ్యత్వం కాదని గమనించాలి. అంటే, వినియోగదారులు యాక్సెస్ చేయలేని కంటెంట్ కొంత ఉంటుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Disney+ Hotstar యొక్క VIP Subscription తో వచ్చే JIO ప్లాన్స్

రూ .401 నెలవారీ ప్లాన్: ఈ ప్లాన్ 90 GB డేటాతో పాటు అపరిమిత కాలింగ్ మరియు జియో యాప్స్ యొక్క యాక్సెస్ అందిస్తుంది. ఇది 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

రూ .2,599 వార్షిక ప్లాన్: ఈ ప్లాన్ 740 జిబి డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు జియో యాప్స్ కి ఉచిత యాక్సెస్ అందిస్తుంది. ఇది 365 రోజులు చెల్లుబాటుతో వస్తుంది.

Add-On డేటా ప్యాక్: పైన తెలిపిన ప్లాన్స్ లేని చందాదారులు 612 రూపాయల నుండి ప్రారంభమయ్యే డేటా యాడ్-ఆన్ వోచర్ల ద్వారా ఈ సేవను పొందవచ్చు. ఇది వినియోగదారులకు డేటా ప్రయోజనాలతో పాటుగా Disney+ Hotstar యొక్క 1 సంవత్సరం ఉచిత VIP సబ్ స్క్రిప్షన్ పొందటానికి అనుమతిస్తుంది.

ఇక ఈ Disney+ Hotstar విషయానికి వస్తే, ఏప్రిల్ 3 న ఈ Disney+ సర్వీస్ Hotstar ద్వారా భారతదేశంలో ప్రారంభించబడింది. ఇది 21st Century Fox కొనుగోలులో భాగంగా ఉంది. ఈ కొత్త సర్వీస్ రెండు స్థాయిలలో లభిస్తుంది. ఇందులో, VIP ప్లాన్ రూ .399 ధరతో సంవత్సరానికి రాగా, ప్రీమియం ప్లాన్ ధర సంవత్సరానికి రూ .1,499 మరియు ఒక సంవత్సరం నడుస్తుంది. ఈ ప్లాట్ఫారమ్ లో కంటెంట్ ని  ‘V’ లేదా ‘P’ తో గుర్తించవచ్చు మరియు ప్రీమియం చందాదారులు టోటల్ కంటెంట్ యాక్సెస్ పొందుతారు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo