Jio launches New Rs 234 Plan in India with 56 days validity
Jio New Plan: చవక ధరలో గొప్ప ప్లాన్ లను అందిస్తున్న రిలయన్స్ జియో, ఇప్పుడు తన పోర్ట్ ఫోలియోలో మరొక కొత్త ప్లాన్ కూడా విడుదల చేసింది. రీసెంట్ గా OTT మరియు అధనపు డేటాతో కొత్త ప్లాన్ లను అందించిన జియో, ఇప్పుడు జియో ఫోన్ యూజర్ల కోసం కూడా కొత్త చవక ప్లాన్ ను విడుదల చేసింది. ఈ ప్లాన్ తో చాలా తక్కువ రేటుకే 56 రోజుల అన్లిమిటెడ్ లాభాలను అందుకోవచ్చు.
రిలయన్స్ జియో యూజర్ల కోసం కొత్త రూ. 234 రూపాయల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను ప్రకటించింది. అయితే, ఈ ప్లాన్ ను కేవలం JioBharat Phone యూజర్ల కోసం మాత్రమే అందించింది. అంటే, జియో భారత్ ఫోన్ ను వినియోగిస్తున్న యూజర్లు మాత్రమే ఈ ప్లాన్ యొక్క లాభాలను అందుకునే అవకాశం వుంది.
ఈ ప్లాన్ స్మార్ట్ ఫోన్ లేదా ఇతర యూజర్లకు వర్తించదు. అయితే, ఈ కొత్త ప్లాన్ జియో భారత్ గొప్ప ప్రయోజనాలను తీసుకు వస్తుంది.
Also Read: ఈరోజే విడుదలైన Realme 12x 5G టాప్ – 5 ఫీచర్స్ మరియు ప్రైస్ తెలుసుకోండి.!
జియో భారత్ ఫోన్ యూజర్ల కోసం రిలయన్స్ జియో అందించిన ఈ కొత్త రూ. 234 ప్రీపెయిడ్ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాన్ని తీసుకు వస్తుంది. ఇది మాత్రమే కాదు, ఈరోజుకు 0.5 GB చొప్పున 56 పూర్తి వ్యాలిడిటీ కాలానికి డైలీ డేటా అందిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత కూడా 64 Kbps స్పీడ్ వద్ద అన్లిమిటెడ్ డేటాని వినియోగించుకోవచ్చు.
పైన తెలిపిన కాలింగ్ మరియు డేటా ప్రయోజనాలతో పాటుగా 28 రోజులకు 300 SMS చొప్పున 56 రోజులకు గాను 600 SMS ప్రయోజనాన్ని కూడా ఈ ప్లాన్ అందిస్తుంది. అలాగే, JioSaavn మరియు JioCinema యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ ను కూడా అందిస్తుంది.