jio launches voice only Jio New Plans
Jio New Plans: టెలికాం అధారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇటీవల చేసిన ఆదేశాల మేరకు రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు అందించింది. 5G లాంచ్ తర్వాత అన్ని టెలికాం కంపెనీలు కూడా గత సంవత్సరం వారి టారిఫ్ రేట్లు పెంచాయి. అందుకే, పెరిగిన రేట్లు సతమవుతున్న యూజర్లకు వెసులుబాటు అందించే విధంగా వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్లు తీసుకురావాలని ఆదేశించింది. ట్రాయ్ ఆదేశాల మేరకు రిలయన్స్ జియో రెండు కొత్త వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్లు అందించింది.
రిలయన్స్ జియో రెండు కొత్త వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ లను మినిమం రేటుతో లాంచ్ చేసింది. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్ లలో ఒకటి 365 రోజులు మరియు మరొకటి 84 రోజులు చెల్లుబాటు అవుతాయి. ఇక ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ రేట్స్ విషయానికి వస్తే, వన్ ఇయర్ ప్లాన్ ను రూ. 1,958 ధరతో మరియు 84 రోజుల ప్లాన్ ను రూ. 458 రూపాయల ధరతో లాంచ్ చేసింది.
జియో కొత్త తీసుకు వచ్చిన ఈ రూ. 1,958 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యాన్ని అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 3600 SMS లను కూడా అందిస్తుంది. డేటా అవసరం లేకుండా కేవలం కాలింగ్ మరియు SMS లను కొరుకునే యూజర్స్ కోసం ఈ ప్లాన్ ను అందించింది.
Also Read: QLED Smart Tv Deal: భారీ డిస్కౌంట్ తో 16 వేలకే లభిస్తున్న 43 ఇంచ్ 4K టీవీ.!
జియో రూ. 458 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా వాయిస్ ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఇది 84 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ కూడా 84 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు పూర్తి వ్యాలిడిటీ కాలానికి 1000 SMS లిమిటెడ్ వినియోగ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ తో ఎటువంటి డేటా లభించదు.
మరిన్ని బెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్ కోసం Click Here