Jio 5G: ఆంద్రప్రదేశ్ లోని ఈ 4 సిటీల్లో ఒకేసారి 5G సర్వీస్ లాంచ్ చేసిన జియో.!
ఆంద్రప్రదేశ్ లోని ఈ సిటీల్లో ఒకేసారి 5G సర్వీస్ లను జియో లాంచ్ చేసింది
'Jio Welcome Offer' లో భాగంగా అన్లిమిటెడ్ 5G డేటా అఫర్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది
1Gbps+ స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటాని పొందుతారని కూడా జియో వెల్లడించింది
Jio 5G: ఆంద్రప్రదేశ్ లోని ఈ సిటీల్లో ఒకేసారి 5G సర్వీస్ లను జియో లాంచ్ చేసింది. రిలయన్స్ జియో ఆంద్రప్రదేశ్ లోని తిరుమల, విశాఖపట్టణం, గుంటూరు మరియు విజయవాడ నగరాల్లో తన 5G సర్వీస్ లను ప్రారంభించింది. అంతేకాదు, 'Jio Welcome Offer' లో భాగంగా అన్లిమిటెడ్ 5G డేటాని కూడా అఫర్ చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. నిన్న జరిగిన లాంచ్ ఈవెంట్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ గుడివాడ అమర్‌నాథ్ గారు, చీఫ్ సెక్రటరీ K.S జవహర్ రెడ్డి గారు మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ K.V రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఈ Jio 5G ని ఆంద్రప్రదేశ్ లో లాంచ్ చేసారు.
Surveyఆంద్రప్రదేశ్ లో జియో యొక్క True 5G సేవలను ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయమని, ఆంద్రప్రదేశ్ లో రిలయన్స్ జియో ఈ 5G నెట్వర్క్ కోసం 6,500 కోట్ల రూపాయలను వెచ్చించడం ద్వారా రాష్ట్ర డెవలప్మెంట్ కు తోడ్పడుతుందని, ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ గుడివాడ అమర్‌నాథ్ గారు తెలిపారు.
ఆంద్రప్రదేశ్ లో Jio యొక్క True 5G సర్వీస్ లను లాంచ్ చేయడం ద్వారా కేవలం ఉత్తమ టెలీకమ్యూనికేషన్ ను పొందడం మాత్రమే కాదు ఆ ప్రాంతాల్లో e-గవర్నెన్స్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, IT మరియు చిన్న మరియు మధ్య స్థాయి (SME) బిజినెస్ వంటి వాటికి మార్గం సుగమం అవుతుందని, చీఫ్ సెక్రటరీ K.S జవహర్ రెడ్డి గారు మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ K.V రాజేంద్రనాథ్ రెడ్డి గారు పేర్కొన్నారు.
ఇక మరిన్ని వివరాల్లోకి వెళితే, తిరుమల, విశాఖపట్టణం, గుంటూరు మరియు విజయవాడ నగరాల్లో Ture 5G సర్వీస్ లు ఇప్పుడు అంధుబాటులోకి వచ్చాయి. అంతేకాదు, ఈ నగరాల్లోని ప్రజలు 'JIO WELCOME OFFER' అఫర్ లో భాగంగా 1Gbps+ స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటాని పొందుతారని కూడా జియో వెల్లడించింది. అలాగే, 2023 జనవరి నాటికి మరిన్ని సిటీల్లో Jio True 5G సర్వీస్ లను అంధుబాటులోకి వస్తావని కూడా జియో పేర్కొంది.
మీరు Jio True 5G సేవలను వినియోగించుకోవడానికి మీ సిమ్ కార్డును మార్చవలసిన అవసరం లేదు మరియు ఈ సర్వీసులను మీ 4G సిమ్ కార్డ్ పైనే ఆనందించవచ్చు. అంతేకాదు, 4G ప్లాన్స్ పైనే మీరు 5G ని ఎంజాయ్ చేయవచ్చు. ఇక మీ 5G ఫోన్ లో 5G నెట్ వర్క్ సెట్ చేసుకోవడానికి, ఫోన్ మీ ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి,సిమ్ కార్డు ఎంచుకొన్న తరువాత 'Preferred network type' అప్షన్ ను ఎంచుకోండి. ఇక్కడ మీకు నెట్ వర్క్ టైప్ (3G,4G,5G) చూపిస్తుంది. మీ నెట్ వర్క్ టైప్ ను 5G గా ఎంచుకోండి మరియు మీకు 5G నెట్ వర్క్ ఎనేబుల్ అవుతుంది.
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile