Jio Unlimited 4G మరియు 5G ప్లాన్ తో కొత్త సంవత్సర స్వాగతం పలికింది.!
Jio Unlimited 4G మరియు 5G ప్లాన్ తో కొత్త సంవత్సర స్వాగతం పలికింది
ఇప్పుడు అన్లిమిటెడ్ 4జి ప్రీపెయిడ్ ప్లాన్లు కూడా Jio అనౌన్స్ చేసింది
4జి నెట్వర్క్ పైన అన్లిమిటెడ్ డేటా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది
Jio Unlimited 4G మరియు 5G ప్లాన్ తో కొత్త సంవత్సర స్వాగతం పలికింది. ఇప్పటివరకు కేవలం అన్లిమిటెడ్ 5జి ప్రీపెయిడ్ ప్లాన్లు మాత్రమే అందించిన రిలయన్స్ జియో, ఇప్పుడు అన్లిమిటెడ్ 4జి ప్రీపెయిడ్ ప్లాన్లు కూడా అనౌన్స్ చేసింది. ఆఫ్ కోర్స్, ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ కొంచెం ప్రియంగానే ఉంటాయి అనుకోండి. కానీ, ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ తో యూజర్లు రోజు మొత్తం 5జి మరియు 4జి నెట్వర్క్ పైన అన్లిమిటెడ్ డేటా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
Jio Unlimited 4G మరియు 5G ప్లాన్
2027 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రిలయన్స్ జియో కొన్ని కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు అనౌన్స్ చేసింది. ఇందులో 28 రోజులు చెల్లుబాటుతో వచ్చే రూ. 399 మరియు 365 రోజులు చెల్లుబాటు అయ్యే రూ. 3,999 ప్రీపెయిడ్ ప్లాన్స్ గొప్ప అన్లిమిటెడ్ లాభాలు అందిస్తాయి. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా 4జి మరియు 5జి నెట్వర్క్ పైన యూజర్లకు పూర్తి చెల్లుబాటు కాలానికి అన్ లిమిటెడ్ డేటాని అందిస్తాయి. కేవలం డేటా మాత్రమే కాదు, ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్లు కూడా అన్లిమిటెడ్ కాలింగ్ తో పాటు మరిన్ని ఇతర ప్రయోజనాలను కూడా ఆఫర్ చేస్తాయి.
రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్ బెనిఫిట్స్
జియో కొత్తగా తీసుకొచ్చిన రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్ 4G మరియు 5G యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసిన యూజర్లకు 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. . ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను 4G మరియు 5G నెట్వర్క్ పైన అన్లిమిటెడ్ డేటా ఆఫర్ చేస్తుంది. కేవలం డేటా మాత్రమే కాదు ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS లాభాలు కూడా అందిస్తుంది.
అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసి యూజర్లకు 4 వేల రూపాయల విలువైన 12 నెలల Canva Pro Lite యాక్సెస్ ని ఉచితంగా అందిస్తుంది. ఇది మాత్రమే కాదు, జియో హాట్ స్టార్ మొబైల్, హాలీవుడ్, 50GB AI క్లౌడ్ మరియు Fan Code యాక్సెస్ లాభాలు ఈ ప్లాన్ అందిస్తుంది.
రూ. 3,999 ప్రీపెయిడ్ ప్లాన్ బెనిఫిట్స్
ఇది జియో కొత్తగా అందించిన వార్షిక అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ కొత్త ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు ఏకంగా 365 రోజులు 5జి మరియు 4జి నెట్వర్క్ పైన అన్లిమిటెడ్ లాభాలు అందుకోవచ్చు. అలాగే, 365 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ అండ్ డైలీ 100 SMS లాభాలు కూడా 365 అందుకోవచ్చు.
ఈ ప్లాన్ తో కూడా యూజర్లకు జియో హాట్ స్టార్ మొబైల్, హాలీవుడ్, 50GB AI క్లౌడ్ మరియు Fan Code యాక్సెస్ లాభాలు అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో కూడా రూ. 4,000 విలువైన ఒక సంవత్సరం Canva Pro Lite ఉచితంగా లభిస్తుంది.