Jio Happy New Year 2.0: యూజర్ల కోసం కొత్త ఏడాది కోసం కొత్త ప్లాన్స్ తెచ్చిన జియో.!
కొత్త ఏడాది కోసం రిలయన్స్ జియో తన వినియోగదారులకు ప్రత్యేక రీఛార్జ్ ఆఫర్లు
Jio Happy New Year 2.0 పేరుతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
అన్లిమిటెడ్ 5G డేటా అందించే మరిన్ని యాడ్ ఆన్ ప్యాక్ లను కూడా ప్రవేశపెట్టింది
కొత్త ఏడాది కోసం రిలయన్స్ జియో తన వినియోగదారులకు ప్రత్యేక రీఛార్జ్ ఆఫర్లు తీసుకొచ్చింది. Jio Happy New Year 2.0 పేరుతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ప్రకటించింది. జియో పదేళ్ల వేడుకల్లో భాగంగా తీసుకొచ్చిన ఈ ఆఫర్ లలో ఆటో చవక రూ. 15 రూపాయలు మొదలుకొని రూ.399 నెలవారీ ప్లాన్ తో పాటు రూ. 3,999 వార్షిక ప్లాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటితో పాటు తక్కువ ధరలో అన్లిమిటెడ్ 5G డేటా అందించే మరిన్ని యాడ్ ఆన్ ప్యాక్ లను కూడా ప్రవేశపెట్టింది.
Jio Happy New Year 2.0
2027 సంవత్సరం కోసం జియో తన యూజర్లకు ముందుగానే గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే జియో తన యూజర్లకు కొత్త సంవత్సరం ప్లాన్స్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా రూ. 15 రూపాయల వన్ డే ప్లాన్ మొదలుకొని రూ. 3,999 రూపాయల వరకు అనేక ప్లాన్స్ అందించింది.
రూ.15, రూ.25 అండ్ రూ.50 డేటా ప్యాక్
రూ.15 తో ఒక రోజు, రూ.25 తో రెండు రోజుల పాటు అన్లిమిటెడ్ 5G డేటా అందుకునే బెస్ట్ ప్లాన్స్ అందించింది. మరోవైపు రూ.50 నైట్ డేటా ప్యాక్ ద్వారా 28 రోజుల పాటు ప్రతిరోజూ అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్లిమిటెడ్ 5G అండ్ 4G డేటా ఉపయోగించుకునే అవకాశం అందించింది. మరింత మంచి విషయం ఏమిటంటే, ఈ ప్రత్యేక సమయంలో వినియోగించిన డేటా ప్రధాన ప్లాన్ డేటా నుంచి తగ్గదు.
రూ. 399 ప్లాన్ ప్రయోజనాలు
ఈ కొత్త ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. ఇందులో అన్లిమిటెడ్ 4G అండ్ 5G డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMS ప్రయోజనాలు ఉన్నాయి. అదనంగా 12 నెలల Canva Pro సబ్ స్క్రిప్షన్, జియో హాట్ స్టార్ మొబైల్ + హాలీవుడ్, జియో టీవీ ద్వారా Fan Code యాక్సెస్, జియో గేమ్స్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ మరియు 50GB జియో AI Cloud స్టోరేజ్ వంటి ప్రయోజనాలు ఈ ప్లాన్ తో లభిస్తాయి.
రూ.3,999 వార్షిక ప్లాన్
ఎక్కువ కాలం వ్యాలిడిటీ కోరుకునే వారి కోసం జియో కొత్త రూ.3,999 ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. ఈ రీఛార్జ్ ప్లాన్ తో 365 రోజుల వ్యాలిడిటీ తో అన్లిమిటెడ్ 4G అండ్ 5G డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 SMS లభిస్తాయి. అలాగే, రూ. 4,000 విలువైన 12 నెలల Canva Pro Lite ఉచిత యాక్సెస్, జియో హాట్ స్టార్ మొబైల్ + హాలీవుడ్, Fan Code యాక్సెస్ మరియు జియో 50GB AI Cloud స్టోరేజ్ వంటి లాభాలు ఈ ప్లాన్ అందిస్తుంది.
రూ.399, రూ.3,999 ప్లాన్లు, రూ.25 యాడ్ ఆన్ ప్లాన్స్ ఈరోజు నవంబర్ 24 నుంచి అందుబాటులోకి వస్తాయి. రూ.15 ప్యాక్ ఇప్పటికే అందుబాటులో ఉండగా, రూ.50 నైట్ డేటా ప్యాక్ నవంబర్ 26 నుంచి లభించనుంది. మీరు రీఛార్జ్ చేసే ముందు MyJio యాప్ లో మీ నంబర్ కు వర్తించే ప్రయోజనాలు మరియు నిబంధనలు పరిశీలించండి.