Jio Free Offer: జియో నెంబర్ ఉంటే ఈ 18 నెలల ఉచిత ఆఫర్ అందుకోండి.!

Updated on 07-Feb-2026
HIGHLIGHTS

Jio Free Offer ఎక్కువ లాభాలు అందించే ఉచిత ఆఫర్ తన యూజర్లకు అందించింది

ఉచిత ఆఫర్స్ అందించడంలో జియో మొదటి నుంచి ముందంజలో ఉంది

యూజర్లకు రూ. 35,100 విలువ చేసే ప్రయోజనాలు ఉచితంగా అందించింది

Jio Free Offer: రిలయన్స్ జియో టారిఫ్ రేట్లు పెంచినా కూడా అంత కంటే ఎక్కువ లాభాలు అందించే ఉచిత లాభాలు తన యూజర్లకు అందించింది. ఆఫ్ కోర్స్ ఉచిత ఆఫర్స్ అందించడంలో జియో మొదటి నుంచి ముందంజలో ఉంది. ఇప్పుడు కూడా యూజర్లకు రూ. 35,100 విలువ చేసే ప్రయోజనాలు ఉచితంగా అందించింది. జియో యూజర్ల కోసం కొత్తగా అందించిన జియో ఉచిత ఆఫర్ గురించి వివరంగా తెలుసుకోండి.

Jio Free Offer: ఏమిటి ఆఫర్?

ఆఫర్ విషయానికి వస్తే, AI రాజ్యమేలుతున్న ఈ కాలంలో ప్రపంచ ప్రసిద్ధ గూగుల్ Ai ప్లాట్ ఫామ్ జెమినీ ఏఐ ప్రో సబ్ స్క్రిప్షన్ ను జియో యూజర్లకు ఉచితంగా అందించింది. వాస్తవానికి, గూగుల్ AI ప్రో యొక్క యాక్సెస్ పొందాలంటే నెలకు కనీసం రూ. 349 రూపాయలు చెల్లించాలి. అటువంటి ఈ గూగుల్ జెమినీ ఏఐ ప్రో సబ్ స్క్రిప్షన్ ను 18 నెలల వరకు జియో యూజర్లు ఉచితంగా అందుకోవచ్చు.

అయితే, ఈ ఉచిత ఆఫర్ పొందాలంటే రిలయన్స్ జియో అందించిన అన్లిమిటెడ్ 5జి ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేయడం తప్పనిసరి అవుతుంది. అంటే, రూ. 349 రూపాయల నుంచి ప్రారంభం అయ్యే జియో ట్రూ 5జి అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ లో ఏదైనా ఒక ప్రీపెయిడ్ ప్లాన్ తో యూజర్లు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే జియో అందించిన ఈ గూగుల్ జెమినీ ఏఐ ప్రో యాక్సెస్ ను ఉచితంగా పొందవచ్చు.

Also Read: ఆసక్తి రేపుతున్న Apple iPhone 18 Pro Max కొత్త లీక్డ్ ఫీచర్స్.!

ఈ ఉచిత యాక్సెస్ అందించే బెనిఫిట్స్ ఏమిటి?

రిలయన్స్ జియో అందించే గూగుల్ జెమినీ ప్రో యాక్సెస్ తో గూగుల్ అందించే ప్రీమియం ఏఐ ప్రయోజనాలు మీకు అందుతాయి. ముఖ్యంగా ఈ యాక్సెస్ తో గూగుల్ ఫోటోస్ లో 2TB స్టోరేజ్ యాక్సెస్ మీకు లభిస్తుంది. అంటే, మీ ఫోన్ స్టోరేజ్ గురించి చింతించకుండా మీ ఫోన్ లో ఉన్న అన్ని ఫోటోలు మరియు వీడియోలు గూగుల్ ఫొటోస్ లో స్టోర్ చేసుకునే అవకాశం మీకు దక్కుతుంది.

ఇదే కాదు ఏఐ తో అద్భుతమైన ఇమేజ్ లను క్రియేటర్ చేసే నానో బనానా లేటెస్ట్ వెర్షన్ అన్లిమిటెడ్ యాక్సెస్ కూడా మీకు లభిస్తుంది. ఇమేజ్ నుంచి వీడియోలు క్రియేట్ చేసే AI వీడియోలు క్రియేటర్ Veo 3.1 యాక్సెస్ కూడా మీకు ఉచితంగా లభిస్తుంది. ఇది కాకుండా సినిమాటిక్ ఫిలిం మేకింగ్ టూల్ Flow యాక్సెస్, గూగుల్ డీప్ రీసెర్చ్ యాక్సెస్ మరియు ఇమేజ్ టు వీడియో క్రియేటర్ Whisk యొక్క యాక్సెస్ కూడా ఫ్రీగా లభిస్తుంది. వీటన్నిటితో పాటు NotebookLM యాక్సెస్ కూడా జియో అందించిన ఈ ఉచిత గూగుల్ జెమినీ యాక్సెస్ తో మీకు అందుతుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :