Jio Free Offer: మీరు జియో యూజర్ అయితే ఈ 18 నెలల ఉచిత ఆఫర్ అందుకోండి.!

HIGHLIGHTS

రిలయన్స్ జియో కొత్తగా ఉచిత ఆఫర్ ఒకటి అందించింది

ఏకంగా 18 నెలల వరకు ఈ ఉచిత లాభాలు అందిస్తుంది

ఇప్పటి వరకు ఈ ఉచిత ఆఫర్ అందుకోకుంటే వెంటనే అందుకోండి

Jio Free Offer: రిలయన్స్ జియో కొత్తగా ఉచిత ఆఫర్ ఒకటి అందించింది. అదికూడా ఏకంగా 18 నెలల వరకు ఈ ఉచిత లాభాలు అందిస్తుంది. దేశంలో మొదటగా ఉచిత 4G సర్వీస్ అందించడం మొదలుకొని ఉచిత అన్లిమిటెడ్ 5జి వరకు చాలా ఉచిత ఆఫర్స్ అందించిన జియో, ఇప్పుడు మరో ఉచిత ఆఫర్ ను కూడా అందించింది. మీరు జియో యూజర్ అయితే ఈ 18 నెలల ఉచిత ఆఫర్ ను అందుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ ఉచిత ఆఫర్ అందుకోకుంటే వెంటనే అందుకోండి.

Jio Free Offer: ఏమిటి ఈ కొత్త ఆఫర్?

రిలయన్స్ జియో అన్లిమిటెడ్ 5జి యూజర్ల కోసం ఈ కొత్త ఉచిత ఆఫర్ ను అందించింది. అదేమిటంటే, రిలయన్స్ జియో ఆఫర్ చేస్తున్న అన్లిమిటెడ్ 5జి ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు గూగుల్ జెమినీ ఏఐ ప్రో యాక్సెస్ ను ఉచితంగా అందిస్తుంది. అది కూడా ఒక రోజు రెండు రోజులు లేదా ఒక వారం లేదా నెల రోజులు కాదు ఏకంగా 18 నెలలు ఉచితంగా ఆఫర్ చేస్తోంది.

Jio Free Offer అందించే ప్లాన్స్ ఏమిటి?

ఇక ఈ ఉచిత గూగుల్ జెమినీ ఏఐ ప్రో యాక్సెస్ అందించే ప్రీపెయిడ్ ప్లాన్స్ విషయానికి వస్తే, రూ. 349 రూపాయల నుంచి మొదలయ్యే అన్ని జియో ట్రూ 5జి అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ తో కూడా ఈ ఉచిత బెనిఫిట్ లభిస్తుంది. ఈ ఉచిత ఆఫర్ మీరు అందుకోవాలంటే జస్ట్ ఏదైనా ఒక జియో అన్లిమిటెడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే సరిపోతుంది.

Also Read: Realme C83 5G: టాప్ ఫీచర్స్ విడుదల చేసిన కంపెనీ.. బడ్జెట్ ఫోన్ ఫీచర్స్ అదుర్స్.!

ఈ ఆఫర్ తో వచ్చే బెనిఫిట్స్ ఏమిటి?

జియో అన్లిమిటెడ్ 5జి ప్రీపెయిడ్ ప్లాన్స్ తో వచ్చే గూగుల్ జెమినీ ప్రో యాక్సెస్ అందించే ప్రయోజనాలు గొప్పగా ఉంటాయి. ఈ ఉచిత ఆఫర్ తో గొప్ప ఏఐ ఫోటోలు క్రియేట్ చేసే నానో బనానా 2 అన్లిమిటెడ్ యాక్సెస్ లభిస్తుంది. ఇమేజ్ తో వీడియోలు జనరేట్ చేసే AI వీడియో క్రియేటర్ Veo 3.1 కోసం కూడా ఉచిత యాక్సెస్ అందుతుంది. సినిమాటిక్ ఫిలిం మేకింగ్ టూల్ Flow యాక్సెస్ మరియు గూగుల్ డీప్ రీసెర్చ్ యాక్సెస్ కూడా అందుతుంది.ఇది కాకుండా ఇమేజ్ టు వీడియో క్రియేటర్ Whisk ఫ్రీగా లభిస్తుంది. గూగుల్ జెమినీ తో వచ్చే NotebookLM కోసం కూడా యాక్సెస్ లభిస్తుంది.

ఈ ఉచిత యాక్సెస్ తో మీకు గూగుల్ ఫోటోస్ కోసం 2TB ఉచిత స్టోరేజ్ యాక్సెస్ అందుతుంది. ఇది ఫోన్ యూజర్ ఫోన్ స్టోరేజ్ తో పని లేకుండా ఫోన్ లో ఉన్న అన్ని ఫోటో, వీడియో మరియు మీడియా డేటా ను గూగుల్ ఫొటోస్ లో స్టోర్ చేసుకునే అవకాశం యూజర్లకు లభిస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :