Jio Free Offer for jio users who recharges unlimited 5g plans
Jio Free Offer: అది నుంచి యూజర్లకు ఉచిత ఆఫర్స్ అందించడంలో రిలయన్స్ జియో ముందంజలో ఉంటుంది. ఇండియాలో 4G నెట్ వర్క్ ను స్థాపిస్తూనే రిలయన్స్ జియో తన యూజర్లకు ఉచిత నెట్ వర్క్ ఆఫర్ చేసింది. అంతేకాదు, 5G నెట్ వర్క్ స్టార్ట్ చేసినప్పుడు కూడా 4జి రేటుకే అన్లిమిటెడ్ 5జి అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందించింది. ఇలా ఎన్నో ఉచిత ఆఫర్స్ అందించిన జియో, ఇప్పుడు మరో గొప్ప ఉచిత ఆఫర్ అందించింది. అది కూడా ఒకటి, పది, వంద రూపాయలు కాదు ఏకంగా రూ. 35,100 విలువైన బెనిఫిట్స్ యూజర్లు ఉచిత అందుకోవచ్చు.
రిలయన్స్ జియో కొత్తగా ఈ ఉచిత ఆఫర్ ను ప్రకటించింది. అయితే, ఈ ఉచిత ఆఫర్ పొందాలంటే జియో యొక్క అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అంటే, మీరు జియో నెంబర్ ను కలిగి ఉండి, జియో అందించిన ఏదైనా ఒక అన్లిమిటెడ్ 5జి ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే, ఈ ఉచిత ఆఫర్ మీకు లభిస్తుంది. ఉచిత ఆఫర్, ఉచిత ఆఫర్ అని చెబుతున్నారు ఇంతకీ ఏమిటా ఉచిత ఆఫర్ అని అడుగుతున్నారా? అక్కడికే వస్తున్నా. చాలా ప్రీమియం ఫీచర్స్ కలిగిన గూగుల్ జెమిని AI ప్రో మోడల్ యాక్సెస్ ను 18 నెలల పాటు జియో తన అన్లిమిటెడ్ 5జి ప్రీపెయిడ్ ప్లాన్ లతో యాడ్ చేసింది. మీరు ఈ ప్లాన్స్ లో ఏదైనా ఒక ప్లాన్ తో రీఛార్జ్ చేసే మీకు ఈ యాక్సెస్ ను జియో ఉచితంగా అందిస్తుంది.
వాస్తవానికి, గూగుల్ జెమినీ AI ప్రో ఒక నెల యాక్సెస్ పొందాలంటే రూ. 1,950 రూపాయలు చెల్లించాలి. అలాంటిది 18 నెలలు ఈ యాక్సెస్ పొందాలంటే ఏకంగా రూ. 35,100 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, జియో అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ తో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఈ గూగుల్ జెమినీ AI ప్రో యాక్సెస్ ను పూర్తిగా ఉచితంగా అందుకోవచ్చు.
జియో నెంబర్ కలిగి జియో అందించే అన్లిమిటెడ్ 5జి ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే మీకు ఈ ఉచిత లాభాలు అందుతాయి. అయితే, మీరు 18 సంవత్సరాలు పైబడిన యూజర్ అయ్యుండాలి. ఇక ప్రీపెయిడ్ ప్లాన్స్ విషయానికి వస్తే, రిలయన్స్ జియో యొక్క రూ. 349 ప్రీపెయిడ్ ప్లాన్ నుంచి మొదలుకొని ఆపై లభించే అన్ని అన్లిమిటెడ్ 5జి ప్రీపెయిడ్ ప్లాన్స్ తో కూడా ఈ ఉచిత జెమినీ ఎఐ ప్రో ఆఫర్ లభిస్తుంది.ఈ కేటగిరిలో మొత్తం 14 ప్రీపెయిడ్ ప్లాన్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రింద అందించిన చిత్రంలో ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ వివరాలు ఉన్నాయి, ఇక్కడ మీరు చూడవచ్చు.
Also Read: BSNL VoWiFi: బిఎస్ఎన్ఎల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక నెట్ వర్క్ సమస్య ఉండదు.!
గూగుల్ జెమినీ ఎఐ ప్రో 18 యాక్సెస్ తో మీకు ప్రీమియం AI బెనిఫిట్స్ లభిస్తాయి. అమేజింగ్ ఇమేజ్ క్రియేటర్ నానో బనానా ప్రో యాక్సెస్ మొదలుకొని హై రిజల్యూషన్ AI వీడియో క్రియేటర్ Veo 3.1, గూగుల్ డీప్ రీసెర్చ్, గూగుల్ యొక్క సినిమాటిక్ ఫిల్మ్ మేకింగ్ టూల్ Flow తో పాటు ఇమేజ్ టు వీడియో క్రియేటర్ Whisk వరకు టోటల్ యాక్సెస్ మీకు లభిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా గూగుల్ ఫోటోస్, జిమెయిల్ మరియు గూగుల్ డ్రైవ్లో లెక్కలేనన్ని ఫోటోలు వీడియోలు క్లౌడ్ లో స్టోర్ చేయడానికి 2TB గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ కూడా మీకు అందిస్తుంది.