jio diwali offer 2024 announced free vouchers and coupons worth rs 3350
Jio Diwali Offer: దీపావళి 2024 సందర్భంగా జియో కొత్త డీల్స్ ను అందించింది. జియో దివాళి ధమాకా ఆఫర్ పేరుతో ఈ కొత్త ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ తో అందించిన ప్లాన్ లను రీఛార్జ్ చేసే యూజర్లకు రూ. 3,350 రూపాయల వరకు అదనపు లాభాలు అందిస్తుంది. జియో అందించిన ఈ దివాళి ఆఫర్ వివరాలు తెలుసుకోండి.
జియో ఈ కొత్త దీపావళి ఆఫర్ ను రెండు ప్రీపెయిడ్ ప్లాన్ లపై అందించింది. రూ. 3599 ప్రీపెయిడ్ ప్లాన్ తో ఈ పూర్తి లాభాలు అందుకోవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు EaseMyTrip.com తో చేసే హోటల్ లేదా ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ పై రూ. 3,000 రూపాయల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇది కాకుండా Ajio షాపింగ్ పై Rs.200 డిస్కౌంట్ మరియు స్విగ్గి ఆర్డర్స్ పై రూ. 150 రూపాయల అదనపు తగ్గింపు లభిస్తుంది.
Also Read: SAMSUNG Galaxy S23 FE భారీ డిస్కౌంట్ తో మిడ్ రేంజ్ ధరలో లభిస్తోంది.!
జియో యొక్క రూ. 3599 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్, జియో ట్రూ 5G నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా మరియు రోజుకు 100 SMS లను అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 4G నెట్ వర్క్ పై డైలీ 2.5GB హాయ్ స్పీడ్ 4జి డేటా అందిస్తుంది. ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ తో జియో సినిమా, జియో క్లౌడ్ మరియు జియో టీవీ యాప్స్ కి కాంప్లిమెంటరీ యాక్సెస్ కూడా లభిస్తుంది.
అంతేకాదు, రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ తో కూడా పైన తెలిపిన రూ.3350 అందుకునే అవకాశం జియో అందించింది. అయితే, ఈ ప్లాన్ పై అందించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం రూ. 3,350 వరకు లాభాలు అందుకునే అవకాశం వుంది. అంటే, ఖచ్చితంగా ఎంత లాభాలు పొందవచ్చు, అని మాత్రం క్లియర్ గా చెప్పలేము.
మరిన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ చెక్ చేయడానికి మరియు మొబైల్ రీఛార్జ్ కోసం Click Here