Jio Best Prepaid Plan 2024: సంవత్సరం మొత్తం ఆల్రౌండ్ లాభాలు అందుకోండి.!

HIGHLIGHTS

సంవత్సరం మొత్తం ఆల్రౌండ్ లాభాలను అందించే Jio కొత్త ప్లాన్

Jio Best Prepaid Plan 2024

ఈ జియో ప్లాన్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే చాలు సంవత్సరం మొత్తం ప్రయోజనాలు

Jio Best Prepaid Plan 2024: రిలయన్స్ జియో రీసెంట్ గా సంవత్సరం మొత్తం ఆల్రౌండ్ లాభాలను అందించే కొత్త ప్లాన్ ఒకటి ప్రకటించింది. ఈ ప్లాన్ తో 365 రోజుల పాటు కాలింగ్, డేటా, SMS ప్రయోజనాలతో పాటుగా 14 OTT లకు ఉచిత షబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది. ఈ జియో ప్లాన్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే చాలు సంవత్సరం మొత్తం కాలింగ్, డేటా లేదా ఎంటర్టైన్మెంట్ అంటూ, ఎటువంటి చింతా లేకుండా ఉండవచ్చని జియో చెబుతోంది.

Jio Best Prepaid Plan 2024

రిలయన్స్ జియో గత నెల ప్రకటించిన ఎంటర్టైన్మెంట్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 4,498 గురించే మనం మాట్లాడుకుంటోంది. ఈ వన్ ఇయర్ ఎంటర్టైన్మెంట్ ప్రీపెయిడ్ ప్లాన్ కాలింగ్, డేటా, sms మరియు OTT సబ్ స్క్రిప్షన్ వంటి అన్ని ప్రయోజనాలను అందిస్తుంది. ఈ జియో వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలను ఈ క్రింద చూడవచ్చు.

Also Read : CES 2024: టాప్ టెక్ షో నుండి ప్రదర్శించిన మూడు కొత్త గేమింగ్ ల్యాప్ టాప్స్.!

జియో రూ. 4,498 ప్లాన్

జియో రూ. 4,498 ప్లాన్ పూర్తిగా 365 రోజుల వ్యాలిడిటీతో అందిస్తుంది. ఈ ప్లాన్ తో 365 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS సౌకర్యాన్ని ఈ ప్లాన్ రీఛార్జ్ చేసే యూజర్లకు అంధిస్తుంది. ఈ ప్లాన్ తో 4G నెట్ వర్క్ పైన రోజుకు 2 GB ల చొప్పున 730 GB ల డేటాని అందుకుంటారు. అదే 5G నెట్ వర్క్ పైన ఐతే అన్లిమిటెడ్ 5G డేటా ఆనందాన్ని పొందవచ్చు.

కేవలం ఈ ప్రయోజనాలే అనుకోకండి, ఈ ప్లాన్ తో 14 OTT లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో JioTV app ద్వారా Sony LIV, ZEE5, Lionsgate Play, Discovery+, EPIC ON, Sun NXT, Kanchha Lannka, Planet Marathi, Chaupal, Docubay, మరియు Hoichoi లతో లను పొందవచ్చు. అంతేకాదు, వన్ ఇయర్ Disney+Hotstar మొబైల్ మరియు వన్ ఇయర్ Prime Video మొబైల్ సబ్ స్క్రిప్షన్ లను కూడా ఉచితంగా అందుకుంటారు.

ఈ ప్లాన్ ద్వారా అందించే 1 ఇయర్ JioCinema Premium సబ్ స్క్రిప్షన్ కూపన్, యూజర్ యొక్క MyJio account ద్వారా అందించ బడుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :