Jio Best Plans which offers unlimited and free benefits under budget price
Jio Best Plans: రిలయన్స్ జియో యూజర్ల కోసం అందించిన రెండు బెస్ట్ ప్లాన్స్ నెలకు రూ. 300 ఖర్చుతోనే అన్లిమిటెడ్ లాభాలు అండ్ ఫ్రీ బెనిఫిట్స్ కూడా అందిస్తాయి. ఈ రెండు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించే కంప్లీట్ బెనిఫిట్స్ మరియు ఈ ప్లాన్ తో వచ్చే ఉచిత బెనిఫిట్స్ గురించి కూడా ఈరోజు తెలుసుకోండి. ఈ రెండు ప్లాన్స్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అన్లిమిటెడ్ 5జి ప్రీపెయిడ్ ప్లాన్స్ గా జియో యూజర్ల నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
రిలయన్స్ జియో అందించిన మూడు నెలల లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్ రూ. 899 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ మరియు రూ. 999 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా ఈ కోవకు చెందుతాయి. ఈ ప్లాన్స్ కూడా 90 రోజులు మరియు అంత అంతకంటే ఎక్కువ రోజులు చెల్లుబాటు అవుతాయి. ఈ ప్లాన్స్ ప్రైస్ ను నెలవారీగా లెక్కిస్తే, నెలకు కేవలం రూ. 300 రూపాయలు మాత్రమే అవుతుంది. అంటే, ఈ ప్లాన్ నెలకు కేవలం రూ. 300 రూపాయల ఖర్చుతోనే అన్లిమిటెడ్ లాభాలు అందిస్తాయి. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించే బెనిఫిట్స్ ఇప్పుడు వివరంగా చూద్దాం.
ఇది జియో అందించిన మూడు నెలల అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ చవక ధరలో అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ లో ఒకటిగా నిలుస్తుందని జియో యూజర్లు చెబుతారు. ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే 90 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ డేటా మరియు డైలీ 100 SMS తో అందుతాయి. ఇది మాత్రమే కాదు 4జి నెట్ వర్క్ పై డైలీ 2 జీబీ హై స్పీడ్ డేటా మరియు 20 జీబీ అదనపు డేటా కూడా అందిస్తుంది. అదనంగా, రూ. 3,500 రూపాయల విలువైన 18 నెలల గూగుల్ జెమిని ప్రో AI యాక్సెస్ ఉచితంగా అందిస్తుంది.
ఇది జియో యొక్క లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ మరియు ఈ ప్లాన్ 98 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 98 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, అన్లిమిటెడ్ 5జి డేటా మరియు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనాలు అందుకుంటారు. అంతేకాదు, ఈ ప్లాన్ తో డైలీ 2 జీబీ 4జి డేటా మరియు 18 నెలల గూగుల్ జెమిని ప్రో AI యాక్సెస్ కూడా ఉచితంగా అందిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ అమౌంట్ నెల వారీగా (30 రోజులు) లెక్కిస్తే నెలకు కేవలం రూ. 305 రూపాయలే అవుతుంది.
Also Read: Motorola Signature సిరీస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ టీజర్ విడుదల చేసింది.!
ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ పై మరో కామన్ బెనిఫిట్ కూడా జియో అందిస్తుంది. అదేమిటంటే, ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 3 నెలల జియో హాట్ స్టార్ మెంబర్ షిప్ ఉచితంగా లభిస్తుంది.