Jio Best Plans which offers three months complete unlimited benefits
Jio Best Plans: రిలయన్స్ యూజర్లకు బడ్జెట్ ధరలో మూడు నెలలు కంప్లీట్ అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందించే బెస్ట్ ప్లాన్స్ గురించి ఈరోజు చూడనున్నాము. యూజర్ లకు వేగవంతమైన 5G నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ బెనిఫిట్స్ ను మూడు నెలల పాటు అందించే లాంగ్ ప్లాన్స్ కోసం చూసే వారికి ఈ ప్లాన్స్ బెస్ట్ ప్లాన్స్ గా ఉంటాయి. ఈ జియో బెస్ట్ అన్లిమిటెడ్ 5జి ప్రీపెయిడ్ ప్లాన్స్ చూద్దాం.
రిలయన్స్ జియో లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్స్ లో 90 రోజు మరియు అంత కంటే ఎక్కువ రోజులు చెల్లుబాటు అయ్యే అన్లిమిటెడ్ 5జి ప్రీపెయిడ్ ప్లాన్స్ లో రూ. 899 మరియు రూ. 999 రెండు ప్లాన్స్ బెస్ట్ ప్లాన్స్ గా నిలుస్తాయి. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా మూడు నెలల పాటు యూజర్లకు కంప్లీట్ అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందిస్తాయి. ఈ రెండు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించే పూర్తి ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
జియో రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ యూజర్లకు 90 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ బడ్జెట్ 90 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ యూజర్లు పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 5జి నెట్ వర్క్ పై 90 రోజులు అన్లిమిటెడ్ 5జి డేటా అందిస్తుంది. అలాగే, 4G నెట్ వర్క్ పై రోజుకు 2GB చొప్పున 90 రోజులకు 180 మరియు అదనపు 20GB డేటా కలుపుకుని 200GB టోటల్ డేటా ఆఫర్ చేస్తుంది. ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ డైలీ 100 ఉచిత SMS సౌకర్యం కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో జియో టీవీ మరియు జియో AI క్లౌడ్ కు కూడా ఉచిత యాక్సెస్ అందిస్తుంది.
Also Read: Realme 14T 5G: ధర, ఫీచర్స్ మరియు ఆఫర్స్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోండి.!
జియో రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా మూడు నెలల అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 98 రోజుల వ్యాలిడిటీ అందుకుంటారు. ఈ 98 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5G డేటా కూడా ఆఫర్ చేస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేసే యూజర్లు రోజుకు 4G నెట్ వర్క్ పై 2GB చొప్పున 98 రోజులకు 196GB డేటా కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కూడా డైలీ 100 ఉచిత SMS వినియోగ ప్రయోజనం అందిస్తుంది. అలాగే, జియో టీవీ మరియు జియో AI క్లౌడ్ ఉచిత యాక్సెస్ కూడా అందిస్తుంది.
ఈ రెండు జియో బడ్జెట్ మూడు నెలల ప్రీపెయిడ్ ప్లాన్ మరో అదనపు ప్రయోజనం కూడా అందిస్తుంది. అదేమిటంటే, ఈ ప్లాన్ తో 90 రోజుల జియో హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.