ఈ Jio Best Plan తో 200GB డేటా మరియు అన్లిమిటెడ్ లాభాలు అందుకోవచ్చు.!

HIGHLIGHTS

భారత్ లో జరుగుతున్న IPL 2024 కోసం కొత్త ప్లాన్ ను జియో అందించింది

ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు మరిన్ని లాభాలను కూడా అందుకోవచ్చు

రిలయన్స్ JIo యొక్క లేటెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ JIo యొక్క ఈ లేటెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ తో 200GB డేటా మరియు అన్లిమిటెడ్ లాభాలు అందుకోవచ్చు. భారత్ లో జరుగుతున్న IPL 2024 కోసం ఈ కొత్త ప్లాన్ ను జియో అందించింది. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు మరిన్ని లాభాలను కూడా అందుకోవచ్చు. మరి జియో ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలేమిటి అని తెలుసుకుందామా.

Jio Best Plan

CRICKET OFFER లో భాగంగా జియో కొత్తగా తీసుకొచ్చిన రూ. 749 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ఈ లాభాలను అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు డైలీ డేటా, అదనపు డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మరిన్ని ఇతర ప్రయోజనాలను అందుకుంటారు.

జియో రూ. 749 ప్రీపెయిడ్ ప్లాన్

జియో రూ. 749 ప్రీపెయిడ్ ప్లాన్ మూడు నెలల వ్యాలిడిటీ తో వస్తుంది. అంటే, ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది మరియు ఈ 90 రోజుల వ్యాలిడిటీ కాలానికి పూర్తిగా అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 90 రోజుకు 2GB చొప్పున 180GB ల డేటా + 20GB ల అదనపు డేటాతో టోటల్ 200GB డేటా అందిస్తుంది.

Jio Best Plan

Also Read: 50MP Sony – LYTIA 700C కెమెరాతో వస్తున్న మోటోరోలా అప్ కమింగ్ ఫోన్.!

అదే 5G నెట్ వర్క్ పైన అయితే, పూర్తిగా అన్లిమిటెడ్ 5జి డేటా ని యూజర్లు పొందుతారు. ఈ ప్లాన్ తో రోజుకు 100 SMS ఉపయోగ సౌలభ్యం కూడా అందిస్తుంది. అంటే, ఈ జియో ప్లాన్ తో కాలింగ్, డేటా మరియు SMS ప్రయోజనాలు అందినట్లే.

ఇక ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో జియో టీవీ, జియో సినిమా మరియు జియో క్లౌడ్ లకు ఉచిత యాక్సెస్ ను కూడా అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :