Jio Best Plan which offers unlimited benefits till 70 days
Jio Best Plan: రిలయన్స్ జియో యొక్క బెస్ట్ బడ్జెట్ రెండు నెలల బెస్ట్ ప్లాన్ గురించి ఈరోజు చూడనున్నాము. ఎందుకంటే, టెలికాం ఇండస్ట్రీ లో పెరిగిన టారిఫ్ రేట్లు దెబ్బకి చవక ధరలో లభించే బెస్ట్ మరియు లాంగ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ పై యూజర్లు మక్కువ చూపుతున్నారు. అందుకే, ఈరోజు జియో యూజర్లకు అందుబాటులో ఉన్న 70 రోజుల బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్ ను అందిస్తున్నాము.
జియో యొక్క రూ. 719 మరియు మరియు రూ. 749 రూపాయల రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా జియో ఆఫర్ చేస్తున్న బెస్ట్ 70 డేస్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గా నిలుస్తాయి. ఈ రెండు ప్లాన్ లలో చవక ధరలో 70 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్లాన్ మొత్తాన్ని నెలవారీగా లెక్కిస్తే నెలకు కేవలం రూ. 387 రూపాయలే అవుతుంది.
Also Read: Realme P3 Ultra: బడ్జెట్ సూపర్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసిన రియల్ మీ.!
ఈ జియో బడ్జెట్ అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజనాల విషయానికి వస్తే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 70 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ 70 రోజుల చెల్లుబాటు కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ మరియయు ట్రూ జియో 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటాని కూడా అందిస్తుంది. ఇది మాత్రమే కాదు, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు డైలీ 100SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది.
ఇది కాకుండా ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో 4G నెట్ వర్క్ పై డైలీ 2GB డేటా కూడా అందిస్తుంది. అలాగే, జియో టీవీ మరియు జియో క్లౌడ్ రెండు యాప్స్ కి యాక్సెస్ కూడా అందిస్తుంది.