Jio: అధిక ప్రయోజనాలు అందించే బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ పైన ఒక లుక్కేయండి..!
అధిక ప్రయోజనాలు అందించే Jio బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్
ఈ ప్లాన్ 388 రోజుల అన్లిమిటెడ్ ప్రయోజనాలను అందిస్తుంది
అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2.5GB డేటా మరియు మరిన్ని ప్రయోజనాలను అందుకోవచ్చు
Jio: అధిక ప్రయోజనాలు అందించే బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ పైన ఒక లుక్కేయండి. ఈ ప్లాన్ జియో కస్టమర్లు ఏకంగా 388 రోజుల అన్లిమిటెడ్ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ తో 388 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2.5GB డేటా మరియు మరిన్ని ప్రయోజనాలను అందుకోవచ్చు. మరి రిలయన్స్ జియో అఫర్ చేస్తున్న ఈ బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ గురించి తెలుసుకుందామా.
Surveyమనం ఇప్పుడు మాట్లాడుతోంది Jio యొక్క Rs.2,999 Plan గురించి. ఈ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటులో వస్తుంది మరియు 23 రోజుల అదనపు వ్యాలిడిటీని ఉచితంగా తీసుకువస్తుంది. ఈ ప్లాన్ అఫర్ చేసే అన్ని లాభాలను క్రింద చూడవచ్చు.
Jio Rs.2,999 Plan
ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 365 వ్యాలిడిటీతో మరియు 23 రోజుల అదనపు వ్యాలిడిటీతో కలిపి మొత్తం 388 రోజుల వ్యాలిడిటీతో అందిస్తుంది. ఈ మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా మరియు 75GB అదనపు డేటా కలుపుకొని మొత్తం 987.5GB ల హై స్పీడ్ డేటా తీసుకువస్తుంది.
అధనంగా, ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది. అంతేకాదు, జియో 5G నెట్ వర్క్ అందుబాటులో ఉన్న సమయంలో అన్లిమిటెడ్ 5G డేటాని ప్రయోజనాన్ని కూడా ఈ ప్లాన్ తో పొందవచ్చు.
తక్కువ ధరలో లాంగ్ వ్యాలిడిటీ అందించే మరొక ప్లాన్ కూడా. అదే Jio యొక్క Rs.2,023 Plan మరియు ఈ ప్లాన్ కూడా ప్రతిరోజూ కాలింగ్ మరియు అధిక డేటా అవసరాన్ని తీర్చగలిగే బెస్ట్ ప్లాన్ గా చెప్పవచ్చు.
Jio Rs.2,023 Plan
ఈ ప్లాన్ అన్ని నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ ని అందిస్తుంది. ఈ ప్లాన్ 252 రోజుల చెల్లుబాటుతో వస్తుంది మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం 630 GB ల హైస్పీడ్ డేటా తీసుకువస్తుంది. ఈ ప్లాన్ డైలీ 100 SMS లను కూడా అందిస్తుంది మరియు జియో అన్ని యాప్స్ కి కూడా ఉచిత యాక్సెస్ ను తీసుకువస్తుంది.
మరిన్ని జియో ప్లాన్స్ కోసం Click Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile