jio announced Jio Republic Day Offer 2025 with more benefits
Jio Republic Day Offer 2025: రిపబ్లిక్ డే 2025 సందర్భంగా రిలయన్స్ జియో కొత్త ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ ను వన్ ఇయర్ ప్లాన్ తో అందించింది. ఈ ఆఫర్ తో అదనపు లాభాలు యూజర్లకు అందుతాయని జియో పేర్కొంది. ఈ ఆఫర్ తో జతగా వచ్చే ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు ఎంత అమౌంట్ తో అయితే రీఛార్జ్ చేస్తారో, అంత అమౌంట్ కు ఉచిత అదనపు లబాలు ఆఫర్ చేస్తుంది. అయితే, ఇది కేవలం ఈ ప్రీపెయిడ్ ప్లాన్ పై మాత్రమే అందిస్తుంది సుమా.
రిలయన్స్ జియో ఈ కొత్త రిపబ్లిక్ డీ ఆఫర్ ను రూ. 3,599 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ తో అందించింది. జియో ఆఫర్ చేస్తున్న ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు అంతే అమౌంట్ తో లాభాలు పొందేలా ఉచిత బెనిఫిట్స్ ను ఈ ప్లాన్ తో జత చేసింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
రిలయన్స్ జియో రూ. 3,599 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు వ్యాలీటీడీ తో వస్తుంది. ఈ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది. అంతేకాదు, 5G నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ డేటా మరియు 4G నెట్ వర్క్ పై డైలీ 2.5GB డేటా చొప్పున 365 రోజులు డేటా అందిస్తుంది. ఇది కాకుండా ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో డైలీ 100SMS వినియోగ బెనిఫిట్ ను కూడా అందిస్తుంది.
ఇక ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు అందించే ఇతర అదనపు బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు రూ. 3,650 రూపాయల వరకు అదనపు బెనిఫిట్స్ అందిస్తుంది. అవేమిటంటే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు Ajio పై రూ. 2999 రూపాయలు లేదా అంతకంటే పైబడి చేసే షాపింగ్ పై రూ. 500 డిస్కౌంట్ అందిస్తుంది. ఇలా రెండు సార్లు యూజర్లు రూ. 1,000 రూపాయల వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు.\
అలాగే, tiara beauty పై చేసే షాపింగ్ (రూ. 999 పైబడి) పై రూ. 500 తగ్గింపు అందిస్తుంది. ఈ విధంగా రెండు సార్లు రూ. 1,000 వరకు తగ్గింపు అందిస్తుంది. ఇది కాకుండా EaseMyTrip పై ఫ్లైట్ టికెట్ బుకింగ్ పై రూ. 1500 వరకు తగ్గింపు లభిస్తుంది. ఇది కాకుండా స్విగ్గీ ఫై రూ. 499 రూపాయల పైబడి చేసే ఫుడ్ ఆర్డర్స్ పై రూ. 150 రూపాయల తగ్గింపు లభిస్తుంది.
Also Read: TRAI ఆదేశాలతో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్ రేట్లు తగ్గించిన Jio మరియు Airtel కంపెనీలు.!
ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు దాదాపుగా రూ. 3,650 రూపాయల వరకు బెనిఫిట్స్ అందుతాయని జియో వెల్లడించింది.
మరిన్ని బెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here