Corona Effect !! మరొకసారి జియో ఉచిత అఫర్

Corona Effect !! మరొకసారి జియో ఉచిత అఫర్
HIGHLIGHTS

జియో వినియోగదారులందరికి ఈ అఫర్ వర్తింప చేసింది.

జియో మరొకసారి తన ఉచిత అఫర్ ను ప్రకటించింది.  కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా భారతదేశం అంతటా పొడిగించిన లాక్ డౌన్ సమయాన్ని దృష్టిలో ఉంచుకొని,  మే 3 వ తేదీ వరకు ఇన్కమింగ్ కాల్ వ్యాలిడిటీని  మే 3 వ తేదీ వరకు పొడిగించినట్లు జియో తెలిపింది. అంతేకాదు, ముందు నుండే అందుబాటులో ఉన్న డబుల్ డేటా బెనిఫిట్స్ ప్లాన్లను కూడా కొనసాగిస్తోంది.

లాక్డౌన్ సమయంలో జియో వినియోగదారులు ఎటువంటి రీఛార్జ్ అవసరం లేకుండానే ఇన్‌ కమింగ్ కాల్స్  ను స్వీకరిస్తూనే ఉంటారు. అంతేకాదు, ఇతర టెలికం సంస్థల మాదిరిగా ఒక నిర్దిష్ట గ్రూప్ కి మాత్రమే పరిమితం కాదని, వినియోగదారులందరికీఇది  ఒకేవిధంగా అందించబడుతుందని జియో పేర్కొంది. ఇది ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియాకు విరుద్ధంగా ఉంది, ఈ రెండూ సంస్థలు కూడా కేవలం తక్కువ-ఆదాయ వినియోగదారులకు మాత్రమే ఈ ప్రత్యేకంగా పొడిగించిన ఇన్‌కమింగ్ కాల్ వ్యాలిడిటీని  అందిస్తున్నాయి.

ఇక డబుల్ డేటా ప్లాన్ల విషయానికి వస్తే, రూ .11, రూ .21, రూ .51, రూ. 101 మరియు రూ.251 ప్లాన్లలో మార్పులు చేసింది మరియు ఈ ప్లాన్స్ రెండు రెట్ల డేటాతో వస్తున్నాయి.

రూ .11 యొక్క బూస్టర్ ప్యాక్ 800MB డేటాను అందిస్తుంది మరియు జియో నుండి ఇతర నంబర్‌ కు కాల్ చేయడానికి 75 నిమిషాల కాలింగ్ కూడా అఫర్ చేస్తుంది. ఇవే కాకుండా, రూ .21 ప్రీపెయిడ్ ప్యాక్‌లకు 2 జీబీ డేటా లభిస్తుంది, ఇతర నెట్‌వర్క్‌లలో 200 నిమిషాలు మీకు అందుతాయి. ఈ ప్రణాళికలు టాప్-అప్ ప్రణాళికలు, కాబట్టి వాటి వ్యాలిడిటీ ఇప్పటికే వాడుతున్న ప్లాన్స్ పైన ఆధారపడి ఉంటుంది.

రూ .51 డేటా బూస్టర్ ప్యాక్‌ లో మొత్తం 3 జీబీ డేటా లభించేది. అయితే, ఇప్పుడు ఈ జియో ప్లాన్ నుండి 6GB డేటా మరియు ఇతర నంబర్లకు 500 నిమిషాలు కాలింగ్ ను  అందుకుంటారు.

101 రూపాయల బూస్టర్ ప్యాక్ ఈ బూస్టర్ ప్యా క్‌లలో అతిపెద్ద ప్లాన్ మరియు ఇంతకు ముందు ఈ ప్లాన్ 6 జిబి డేటా కోసం ఉపయోగించబడింది. అయితే, ఇప్పుడు ఈ ప్లాన్ 12 జిబి డేటాను అందిస్తుంది. ఈ ప్లానులో, జియో నుండి ఇతర నంబర్లకు 1000 నిమిషాలు ఇవ్వబడుతుంది. ఈ ప్లాన్ వ్యవధి మీ ప్రస్తుత ప్రణాళిక వ్యవధిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇక చివరిగా, జియో యొక్క 521 రూపాయల డేటా ప్లాన్ తో ఏకంగా 102GB ల డేటాని ఇస్తోంది.    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo