jio 3 months prepaid plans benefits
Jio Best Plans: రిలయన్స్ జియో యూజర్ల కోసం అందించిన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లలో యూజర్ బడ్జెట్ ను బట్టి అన్ని రకాల లాభాలు అందించే ప్లాన్స్ ఉన్నాయి. ఒక రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ మాత్రం బడ్జెట్ ధరలో అన్ని లాభాలు అందించే ప్లాన్స్ గా ఉంటాయి. అంతేకాదు, ఈ ప్లాన్లు నెలకు కేవలం నెలకు 300 రూపాయలు ఖర్చులోనే అన్లిమిటెడ్ డేటా మొదలుకొని అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ వరకు వరుసపెట్టి అన్ని లాభాలు అందిస్తాయి. కొత్త రీఛార్జ్ కోసం కన్ఫ్యూజ్ అయ్యే వారికి సింపుల్ అండ్ బెస్ట్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ గా ఇవి ఉంటాయి. ఆ బెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం.
జియో ఆఫర్ చేస్తున్న అనేక ప్రీపెయిడ్ ప్లాన్లు ఉన్నాయి. వీటిలో రూ. 899 మరియు రూ. 999 బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గా నిలుస్తాయి. ఈ రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
ఈ రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్ మూడు నెలలు ఆల్ రౌండ్ ప్రయోజనాలు అందిస్తుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 90 రోజులు అన్లిమిటెడ్ 5జి డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS సౌకర్యం కూడా అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ యూజర్లు మూడు నెలల జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందుకుంటారు.
అదే 4జి నెట్ వర్క్ అయితే ఈ ప్లాన్ తో డైలీ 2GB చొప్పున 90 రోజులకు 180 జీబీ డేటా మరియు 20 జీబీ అదనపు డేటా కలుపుకుని టోటల్ 200 జీబీ డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ తో 50 జీబీ Jio AI Cloud ఉచిత స్టోరేజ్ కూడా లభిస్తుంది. ఇవి కాకుండా జియో టీవీ మరియు జియో క్లౌడ్ లకు కూడా ఉచిత యాక్సెస్ అందిస్తుంది.
Also Read: Nova 5G మరియు Pulse 5G: రెండు కొత్త ఫోన్లు లాంచ్ కోసం సిద్ధం.!
ఇది కూడా జియో ఆఫర్ చేస్తున్న ఆల్ రౌండర్ ప్లాన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ ప్లాన్ తో కూడా మూడు నెలల ఆల్రౌండ్ ప్రయోజనాలు అందిస్తుంది. ఈ ప్లాన్ టోటల్ 98 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు అన్లిమిటెడ్ కాలింగ్, 5జి నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేటా మరియు రోజుకు 100 SMS సెండింగ్ లిమిట్ అందుకుంటారు.
ఇక అదనపు ప్రయోజనాలు చూస్తే, ఈ ప్లాన్ 90 రోజుల జియో హాట్ స్టార్ ఉచిత యాక్సెస్ అందిస్తుంది. ఇది కాకుండా జియో AI క్లౌడ్ పై 50 జీబీ ఉచిత స్టోరేజ్ కూడా ఆఫర్ చేస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే 4G యూజర్లకు రోజుకు 2 జీబీ చొప్పున 98 రోజులకు 196 జీబీ డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ తో కూడా జియో క్లౌడ్ మరియు జియో టీవీ ఉచిత యాక్సెస్ అందిస్తుంది.