BSNL Super Plan: రోజుకి కేవలం రూ. 5 ఖర్చుతో అన్లిమిటెడ్ కాలింగ్ అండ్ డేటా అందుకోండి.!

Updated on 15-Jan-2026
HIGHLIGHTS

అన్లిమిటెడ్ కాలింగ్ మరియు అన్లిమిటెడ్ డేటా అందుకోవడానికి కనీసం రోజుకి 10 రూపాయలు అయినా ఖర్చు చేయాల్సి వస్తుంది

బిఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్ కేవలం రోజుకి ఐదు రూపాయల ఖర్చుతో అన్లిమిటెడ్ కాలింగ్ మరియు అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది

ఈ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ యూజర్లు అందరికీ అందుబాటులో ఉంది

BSNL Super Plan: ప్రస్తుతం టెలికాం కంపెనీలు అవలంబిస్తున్న విధానాలు మరియు రీఛార్జ్ ప్లాన్స్ ప్రకారం అన్లిమిటెడ్ కాలింగ్ మరియు అన్లిమిటెడ్ డేటా అందుకోవడానికి కనీసం రోజుకి 10 రూపాయలు అయినా ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ, బిఎస్ఎన్ఎల్ యొక్క ఒక సూపర్ ప్లాన్ కేవలం రోజుకి ఐదు రూపాయల ఖర్చుతో అన్లిమిటెడ్ కాలింగ్ మరియు అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది. మరి బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఈ జబర్దస్త్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి వివరంగా తెలుసుకుందాం.

BSNL Super Plan : ఏమిటి ఈ బిఎస్ఎన్ఎల్ ప్లాన్?

బిఎస్ఎన్ఎల్ ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ని చాలా రోజులుగా తన యూజర్ల కోసం అందుబాటులో ఉంచింది. అదే, రూ. 1,499 రూపాయల లాంగ్ వాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్. బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 300 రోజుల లాంగ్ వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ కేవలం వ్యాలిడిటీ మాత్రమే కాదు అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మరియు ఇతర లాభాలు కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ యూజర్లు అందరికీ అందుబాటులో ఉంది.

Also Read: REDMI Note 14 Pro Plus పై ఫ్లిప్ కార్ట్ సేల్ బిగ్ డీల్ అనౌన్స్ చేసింది.!

BSNL Super Plan : ఈ ప్లాన్ ప్రయోజనాలు ఏమిటి?

బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే మీకు పూర్తిగా 300 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ అందిస్తుంది. ఇది కాకుండా ఈ ప్లాన్ తో డైలీ 100 SMS బెనిఫిట్ కూడా అందిస్తుంది. ఇక డేటా పరంగా, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 300 రోజులకు గాను 32GB హై స్పీడ్ డేటా కూడా అందిస్తుంది. అదేంటి మీరు అన్లిమిటెడ్ డేటా అన్నారు కదా? అని మీకు డౌట్ వచ్చి ఉండవచ్చు.

మేము చెప్పింది నిజమే, ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే 32 జీబీ హాయ్ స్పీడ్ డేటా ముగిసిన తర్వాత 40Kbps వేగంతో 300 రోజులు అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అమౌంట్ ను 300 రోజలకు లెక్కిస్తే రోజుకు కేవలం రూ. 5 రూపాయలు మాత్రమే అవుతుంది.

బిఎస్ఎన్ఎల్ ఇటీవల మరిన్ని సూపర్ ప్లాన్స్ అండ్ ఆఫర్స్ కూడా అందించింది. వీటిలో రూ. 251 ప్రీపెయిడ్ ప్లాన్ గొప్పగా ఉంటుంది. ఎందుకంటే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 30 రోజుల అన్లిమిటెడ్ బెనిఫిట్స్ ఆఫర్ చేస్తుంది. ఎందుకంటే, ఈ ప్లాన్ 30 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, 100 జీబీ హై స్పీడ్ డేటా, డైలీ 100 SMS మరియు BiTV ఉచిత యాక్సెస్ వంటి అన్ని లాభాలు అందిస్తుంది. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం జనవరి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :