BSNL Super Offer which gives 30 unlimited benefits in just 1 rupee
BSNL Super Offer: ప్రభుత్వ టెలికాం కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) యూజర్లకు గొప్ప ఆఫర్ అందించింది. బీఎస్ఎన్ఎల్ అందించిన ఈ ఆఫర్ తో కేవలం ఒక్క రూపాయికే 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందుకోవచ్చు. ఈ ఆఫర్ ఈ నెల ప్రారంభం నుంచి అందుబాటులో ఉంది మరియు మరో 10 రోజులు మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది.
బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన ఫ్రీడమ్ ప్లాన్ ఆఫర్ గురించే మేము ఇప్పుడు చెబుతోంది. ఈ ఆఫర్ ను బీఎస్ఎన్ఎల్ బేస్ ను పెంచే ప్రయత్నం లో భాగంగా ఈ ఆఫర్ ను ఆగస్టు 2025 నెలలో బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది. అయితే, ఈ ఆఫర్ ను కేవలం నెల రోజుల కోసం మాత్రమే అందించింది. అంటే, ఈ ప్లాన్ ను లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ గా అందించింది. అయితే, ఈ ఆఫర్ తో బీఎస్ఎన్ఎల్ కొత్త కనెక్షన్ గణనీయంగా పెరగడంతో ఈ ప్లాన్ ను మళ్ళీ కొనసాగించింది.
అయితే, ఈ బీఎస్ఎన్ఎల్ రూ.1 ప్రీపెయిడ్ ప్లాన్ ను నంబర్ నెలలో పక్కన పెట్టింది. కానీ, మళ్ళీ 1 డిసెంబర్ 2025 నుంచి లిమిటెడ్ టైమ్ ఆఫర్ గా ప్రకటించింది. ఈ ఆఫర్ 31 డిసెంబర్ 2025 తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే, ఈ ఆఫర్ పొందడానికి కొత్త కస్టమర్లకు కేవలం 10 రోజులు మాత్రమే అవకాశం ఉంది. అఫ్ కోర్స్, ఈ డేట్ ను 2026 లో మళ్ళీ పొడిగించినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు.
Also Read: ZEBRONICS 5.1 Dolby సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 7 వేలకే లభిస్తుంది.!
ఈ ప్లాన్ కేవలం కొత్తగా బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు తీసుకునే కొత్త కస్టమర్లకు మాత్రమే లభిస్తుంది. ఈ ఆఫర్ కోసాం బీఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ కార్డు ను ఉచితంగా అందిస్తుంది. అంటే, కేవలం 1 రూపాయి చెల్లించి మీరు బీఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ కార్డు మరియు ఆఫర్ తో ఫస్ట్ రీచార్జ్ కూడా చేసుకోవచ్చు.
బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ రూ.1 రీఛార్జ్ ఆఫర్ అందించే బెనిఫిట్స్ విషయానికి వస్తే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. అంటే, రీఛార్జ్ చేసిన రోజు నుంచి 30 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, 2జీబీ డైలీ హై స్పీడ్ డేటా మరియు డైలీ 100SMS వంటి కంప్లీట్ బెనిఫిట్స్ అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో అందించే 2జీబీ డైలీ హై స్పీడ్ డేటా ముగిసిన తర్వాత 40Kbps అన్లిమిటెడ్ డేటా కూడా ఆఫర్ చేస్తుంది.
బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ మొత్తం టెలికాం ఇండస్ట్రీ లో లభించే అతి చవకైన ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది.