Redmi Note 15 Pro Price leaked online know the price before launch
BSNL Super offer: ప్రైవేట్ టెలికాం కంపెనీలు టారిఫ్ రేట్లు పెంచుతున్న సమయంలో బిఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) తన వినియోగదారులకు మరోసారి భారీ ఊరట ఇచ్చింది. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా డైలీ 500MB అదనపు ఉచిత డేటా అందించే స్పెషల్ ఆఫర్‌ను కొన్ని ప్రముఖ రీఛార్జ్ ప్లాన్ల పై ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్ ను లిమిటెడ్ పీరియడ్ తో అందించింది. ఈ ఆఫర్ మరో మూడు రోజుల్లో ముగుస్తుంది.
2026 సంవత్సరం ప్రారంభంలో ఈ సూపర్ ఆఫర్ ను బిఎస్ఎన్ఎల్ అందించింది. అదేమిటంటే, బిఎస్ఎన్ఎల్ యొక్క బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ రూ. 225, రూ. 347, రూ. 485 మరియు రూ. 2399 రీఛార్జ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు డైలీ 500MB డేటా అదనంగా అందిస్తుంది. అంటే, ఈ ఈ ప్లాన్ తో వచ్చే వ్యాలిడిటీ కాలానికి డైలీ 500MB అదనపు డేటా అందిస్తుంది. ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే, ఇందులో నెల రోజుల ప్లాన్ మొదలుకొని వన్ ఇయర్ ప్లాన్ వరకు ఉన్నాయి.
అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ ను కేవలం నెల రోజుల సమయం కోసం మాత్రమే అందించింది. ఈ నెల మొదటి నుంచి ప్రారంభం అయిన ఈ ప్లాన్ ఈ నెల 31వ తేదీతో ముగుస్తుంది. అంటే, మరో మూడు రోజుల్లో బిఎస్ఎన్ఎల్ అందించిన ఈ గొప్ప ఆఫర్ క్లోజ్ అవుతుంది. ఈ ఆఫర్ తో అవిచే ప్లాన్ అందించే బెనిఫిట్స్ ఇప్పుడు చూద్దాం.
Also Read: Redmi Note 15 Pro Price ఆన్లైన్ లో లీకయ్యింది.. లాంచ్ కంటే ముందే ప్రైస్ తెలుసుకోండి.!
బిఎస్ఎన్ఎల్ రూ. 225 రూపాయల ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే 30 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 2.5 జీబీ హై స్పీడ్ డేటా మరియు డైలీ 500MB అదనపు డేటాతో కలిపి టోటల్ 3 జీబీ డేటా అందిస్తుంది. ఇది కాకుండా ఈ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS కూడా అందిస్తుంది.
ఈ మూడు ప్లాన్స్ కూడా ఒకే రకమైన బెనిఫిట్స్ అందిస్తాయి. ఈ మూడు ప్లాన్స్ లో ఉన్న వ్యత్యాసం ఈ ప్లాన్ అందించే వ్యాలిడిటీ. వీటిలో, రూ. 347 రూపాయల ప్లాన్ 50 రోజుల వ్యాలిడిటీ, రూ. 485 రూపాయల ప్లాన్ 72 రోజుల వ్యాలిడిటీ మరియు రూ. 2399 రూపాయల ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో వస్తాయి. ఈ మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2 GB డేటా + 500MB అదనపు ఉచిత డేటా తో కలిపి టోటల్ 2.5GB డేటా మరియు డైలీ 100SMS వంటి ప్రయోజనాలు అందిస్తాయి.
ఈ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించే అదనపు ఉచిత డేటా అందుకోవాలంటే, ఈ ఆఫర్ ముగిసే లోపుగా ఈ ప్లాన్స్ తో రీఛార్జ్ చేయవలసి ఉంటుంది.