సీనియర్ సిటిజన్స్ కోసం BSNL జబర్దస్త్ ఆఫర్ ప్రకటించింది.!

Updated on 27-Oct-2025
HIGHLIGHTS

దేశవ్యాప్తంగా 4G నెట్ వర్క్ ను నిర్మించిన BSNL

ఇప్పుడు యూజర్ బేస్ ని భారీగా పెంపొందించే దిశగా బీఎస్ఎన్ఎల్ అడుగులు

సీనియర్ సిటిజన్స్ కోసం జబర్దస్త్ ఆఫర్ కూడా ప్రకటించింది

దేశవ్యాప్తంగా 4G నెట్ వర్క్ ను నిర్మించిన BSNL, ఇప్పుడు యూజర్ బేస్ ని భారీగా పెంపొందించే దిశగా అడుగులు వేస్తోంది. 2025 దీపావళి పండుగ కానుకగా ఒక్క రూపాయికే 30 రోజుల అన్లిమిటెడ్ ప్లాన్, ఉచిత సిమ్ కార్డు, బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా రీచార్జ్ చేసే వారికి అదనపు డిస్కౌంట్ వంటి ఆఫర్స్ తో పాటు సీనియర్ సిటిజన్స్ కోసం జబర్దస్త్ ఆఫర్ కూడా ప్రకటించింది. ఈ ఆఫర్ తో సీనియర్ సిటిజన్స్ చాలా తక్కువ ఖర్చుతో సంవత్సరం మొత్తం అనిలిమిటెడ్ ప్రయోజనాలు అందుకునే అవకాశం అందించింది. ఈ ఆఫర్ ని బీఎస్ఎన్ఎల్ సమ్మాన్ ప్లాన్ పేరుతో అందించింది.

ఏమిటా BSNL జబర్దస్త్ ఆఫర్?

అక్టోబర్ 18వ తేదీన బీఎస్ఎన్ఎల్ ప్రకటించిన చాలా ఆఫర్స్ లో ఇది కూడా ఒకటి. బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ ను సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేకంగా అందించింది. ఈ ఆఫర్ ను బీఎస్ఎన్ఎల్ సమ్మాన్ ప్లాన్ పేరుతో అందించింది. ఈ ఆఫర్ లో భాగంగా రూ. 1812 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ అందించింది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 365 రోజులు అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందుతాయి. మరి బీఎస్ఎన్ఎల్ సమ్మాన్ ప్లాన్ అందించే కంప్లీట్ ప్రయోజనాలు ఏమిటో చూద్దామా.

BSNL సమ్మాన్ ప్లాన్ ప్రయోజనాలు

బీఎస్ఎన్ఎల్ సమ్మాన్ ప్లాన్ రూ. 1,812 రూపాయల అతి తక్కువ ఖర్చుతో వస్తుంది. ఈ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చెసే యూజర్లకు 3365 రోజులు వ్యాలిడిటీ ఆఫర్ చేస్తుంది. అంతేకాదు, ఈ 365 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 2 జీబీ హై స్పీడ్ డేటా అందిస్తుంది. ఈ రెండు ప్రయోజనాలతో పాటు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. అదనంగా, ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసే సీనియర్ సిటిజన్స్ కి ఆరు నెలల BiTV ప్రీమియం సబ్ స్క్రిప్షన్ కూడా అందిస్తుంది.

అంటే, రూ. 1,812 రూపాయల ధరలో వచ్చే బీఎస్ఎన్ఎల్ సమ్మాన్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే సీనియర్ సిటిజన్స్ కి సంవత్సరం మొత్తం కాలింగ్, డేటా, SMS మరియు ఎంటర్టైన్మెంట్ లాభాలు అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ కేవలం కొత్త సిమ్ కార్డు తీసుకునే సీనియర్ సిటిజన్స్ కి మాత్రమే అందిస్తుంది. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ నెంబర్ ఉపయోగించే సీనియర్ సిటిజన్స్ కి ఈ ప్లాన్ వర్తించదు. అయితే, ఈ రీఛార్జ్ చేయదలచిన సీనియర్ సిటిజన్స్ కి ఉచిత SIM కార్డ్ ఆఫర్ చేస్తుంది.

Also Read: Snapdragon 8 Elite Gen 5 చిప్ సెట్ తో లాంచ్ అవుతున్న అప్ కమింగ్ ఫోన్స్.!

ఈ ప్లాన్ ను నెల వారీగా లెక్కిస్తే నెలకు కేవలం రూ. 151 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే, మీ ఫ్యాలిమి లోని సీనియర్ సిటిజన్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా సంవత్సరం మొత్తం వారితో ఫోన్ లో మాట్లాడుతూ అందనంగా మాట్లాడుకోవచ్చు మరియు డేటా తో వాట్స్అప్ వంటి మాధ్యమాల ద్వారా వీడియో కాలింగ్ కూడా ఎంజాయ్ చేయవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :