bsnl rs 2399 rupees unlimited one year plan benefits
BSNL Super Plan: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అందించే గొప్ప ప్లాన్ ఒకటి అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం మొత్తం ఆనందంగా ఉండవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కోసం చేసే ఖర్చు ను నెలలవారీగా లెక్కిస్తే నెలకు కేవలం రూ. 199 రూపాయలు ఖర్చు మాత్రమే అవుతుంది. అయితే, ఇది తక్కువ ఖర్చుతో గొప్ప అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ 4G సేవలు దేశం మొత్తం అందుబాటులోకి వచ్చింది మరియు ఇప్పుడు గొప్ప ప్లాన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి.
బీఎస్ఎన్ఎల్ యూజర్లకు సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా ఇది చెప్పబడుతుంది. ఇది రూ. 2,399 రూపాయల రీఛార్జి తో వచ్చే అన్లిమిటెడ్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్. ఇది బీఎస్ఎన్ఎల్ యూజర్లకు అందరికీ అందుబాటులో ఉంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ టోటల్ అమౌంట్ ని నెల వారీగా విభజిస్తే, నెలకు కేవలం రూ. 199 రూపాయలు మాత్రమే అవుతుంది.
ఈ ప్లాన్ బీఎస్ఎన్ఎల్ యూజర్లకు జబర్దస్త్ అన్లిమిటెడ్ ప్రయోజనాలు అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను ఫుల్ పైసా వసూల్ ప్లాన్ గా పిలుస్తుంది. యూజర్లు కూడా ఇది నిజంగానే పైసా వసూల్ ప్లాన్ అని చెబుతారు.
Also Read: iQOO 15 Pre Book: భారీ ఆఫర్స్ తో కొత్త ఫోన్ ప్రీ బుకింగ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది.!
బీఎస్ఎన్ఎల్ యొక్క రూ. 2,399 రూపాయల ప్లాన్ వన్ ఇయర్, అంటే 365 రోజులు వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసే యూజర్లు ఈ ప్లాన్ తో వచ్చే వన్ ఇయర్ వ్యాలిడిటీ కాలానికి రోజు 2GB హై స్పీడ్ డేట్ చొప్పున సంవత్సరం మొత్తం డేటా అందుకుంటారు. ఈ డైలీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps వేగంతో సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ డేటా ఆఫర్ చేస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్ సౌలభ్యం కూడా లభిస్తుంది. ఇది మాత్రమే కాదు రోజుకు 100 SMS బెనిఫిట్ కూడా ఈ ప్లాన్ తో అందిస్తుంది.
సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్, అధిక డేటా మరియు SMS ప్రయోజనాలు కోరుకునే యూజర్లు ఈ బెస్ట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ ను పరిశీలించవచ్చు.