BSNL Republic Day offer: అధిక డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ తో కొత్త ప్లాన్ లాంచ్.!

HIGHLIGHTS

భారత రిపబ్లిక్ డే ని పురస్కరించుకుని బిఎస్ఎన్ఎల్ అత్యంత ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను విడుదల చేసింది

ఈ కొత్త ఆఫర్ ప్రీపెయిడ్ ప్లాన్ అధిక డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ వంటి అనేక లాభాలు అందిస్తుంది

ఈ ఆఫర్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందుకుంటారు

BSNL Republic Day offer: ప్రభుత్వ టెలికాం కంపెనీ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) 77వ భారత రిపబ్లిక్ డే ని పురస్కరించుకుని తన వినియోగదారులకు అత్యంత ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ఆఫర్ ప్రీపెయిడ్ ప్లాన్ అధిక డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ వంటి అనేక లాభాలు అందిస్తుంది. ఈ ఆఫర్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందుకుంటారు.

BSNL Republic Day offer: ఏమిటా ఆఫర్?

77వ గణతంత్ర దినోత్సవాన్ని (26 జనవరి 2026) పురస్కరించుకునేందుకు ఈ కొత్త ఆఫర్ రూపొందించబడింది. అంటే, 2026 జనవరి 26 ను కుదించి రాస్తే 2626 వస్తుంది, ఈ ప్లాన్ ను కూడా ఇదే ప్రైస్ తో బిఎస్ఎన్ఎల్ అందించింది. ఇది మాత్రమే కాదు దీంతోపాటు వచ్చే డేటా కూడా 2.6 జీబీ గా నిర్ణయించబడింది. సింపుల్ గా చెప్పాలంటే ఈ ప్లాన్ రిపబ్లిక్ డే మరియు 2026 సంవత్సరం ఓవరాల్ థీమ్ గా ఉంటుంది.

BSNL Republic Day offer: అందించే లాభాలు ఏమిటి?

ఈ కొత్త ఆఫర్ ప్రీపెయిడ్ ప్లాన్ ను రూ. 2626 రూపాయల ధరలో అందించింది. ఈ ఇది వన్ ఇయర్ వ్యాలిడిటీ తో వచ్చే లాంగ్ ప్రీపెయిడ్ ప్లాన్ మరియు సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందిస్తుంది. ఇక ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే లాభాల విషయానికి వస్తే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 365 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందుకుంటారు. సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2.6 జీబీ హై స్పీడ్ డేటా మరియు ఈ డేటా ముగిసిన తర్వాత 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా కూడా అందిస్తుంది. ఇదే కాదు, ఈ ప్లాన్ తో 365 రోజులు రోజుకు 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందుకుంటారు.

Also Read: REDMI Note 15 Pro 5G ముందస్తు బుకింగ్ పేజీ నుంచి కంప్లీట్ ఫీచర్స్ రివీల్ చేసిన కంపెనీ.!

ఈ ప్లాన్ ఎవరికి లభిస్తుంది?

ఇది రెగ్యులర్ ప్రీపెయిడ్ కాదని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే, కేవలం లిమిటెడ్ పీరియడ్ టైం కోసం మాత్రమే ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఆఫర్ ను బిఎస్ఎన్ఎల్ అందించింది. ఈ ప్లాన్ 2026 జనవరి 24 నుంచి బిఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకొచ్చింది మరియు 2026 ఫిబ్రవరి 24 వ తేదీతో ఈ ప్లాన్ ముగుస్తుంది. అంటే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కేవలం నెల రోజులు మాత్రమే అందుబాటులో ఉండే లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ అన్నమాట.

బిఎస్ఎన్ఎల్ అందించిన ఈ ప్రత్యేకమైన ఆఫర్ ను బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :