BSNL New Year Offer with free sim card and 30 days unlimited benefits announced
BSNL New Year Offer: ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ 2026 కొత్త సంవత్సరం కోసం కొత్త ఆఫర్ అనౌన్స్ చేసింది. ఈ కొత్త ఆఫర్ తో ఉచిత SIM మరియు నెల మొత్తం అన్లిమిటెడ్ బెనిఫిట్స్ ని యూజర్లకు అందిస్తుంది. టెలికాం ఇండస్ట్రీ లో పెరిగిన టారిఫ్ రేట్లు పెరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ బిఎస్ఎన్ఎల్ సూపర్ ఆఫర్ తో మీరు ఉచిత లాభాలు అందుకునే అవకాశం ఉంది.
2026 కోసం ఈ కొత్త ఆఫర్ ని అనౌన్స్ చేసింది. అయితే, వాస్తవానికి ఈ ఆఫర్ ఆగస్టు 2025 నెలలో మొదటిసారిగా అనౌన్స్ చేసింది మరియు చాలా సార్లు డేట్ ను పెంచుతూ వచ్చింది. అదే, బిఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ మరియు ఇప్పుడు ఈ ప్లాన్ ను న్యూ ఇయర్ ఆఫర్ పేరుతో మల్లి ప్రకటించింది. అదే, బిఎస్ఎన్ఎల్ రూ. 1 రూపాయి అన్లిమిటెడ్ ప్లాన్. ఈ ప్లాన్ తో కొత్త యూజర్లకు ఉచిత SIM కార్డు మరియు కేవలం రూ. 1 రూపాయి రీఛార్జ్ తో 30 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది.
పైన తెలిపిన విధంగా ఈ బిఎస్ఎన్ఎల్ రూ. 1 రూపాయి ప్రీపెయిడ్ ప్లాన్ తో ఉచిత సిమ్ కార్డు మరియు 30 రోజులు అన్లిమిటెడ్ బెనిఫిట్స్ ఆఫర్ చేస్తుంది. ఈ ఒక్క రూపాయి ఆఫర్ ఎంచుకునే యూజర్లకు 30 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2 జీబీ హై స్పీడ్ డేట్ మరియు నెల మొత్తం డైలీ 100SMS వినియోగ ప్రయోజనం వంటి బెనిఫిట్స్ అందిస్తుంది. అంతేకాదు, డైలీ 2జీబీ హై స్పీడ్ డేట్ ముగిసిన తర్వాత కూడా 40Kbps స్పీడ్ తో నెల మొత్తం అన్లిమిటెడ్ డేటా అందిస్తుంది.
Also Read: ఫస్ట్ టైమ్ boAt 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ 14 వేల బడ్జెట్ ధరలో లభిస్తోంది.. ఎక్కడంటే.!
ఈ ఆఫర్ కేవలం బిఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ కార్డు తీసుకుని ఫస్ట్ రీఛార్జ్ రూ. 1 రూపాయి రీఛార్జ్ చేసే వారికి మాత్రమే లభిస్తుంది. అయితే, ఈ ఆఫర్ ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎందుకంటే, ఈ ఆఫర్ 2026 జనవరి 31వ తేదీతో ముగుస్తుందని బిఎస్ఎన్ఎల్ తెలిపింది. ఇది కేవలం లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ మాత్రమే అని బిఎస్ఎన్ఎల్ ముందు నుంచి చెబుతూ వస్తోంది. అంటే, ఈ ఆఫర్ ఎప్పుడైనా బిఎస్ఎన్ఎల్ నిలిపివేసే అవకాశం ఉంటుంది. అందుకే, ఈ గొప్ప అవకాశం అందుబాటులో ఉండగా అందుకోవడం మంచిది.