BSNL Rs.2799 Plan - 2026
BSNL New Plan: భారత్ ప్రభుత్వం యాజమాన్యంలోని ప్రముఖ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ 2026 కానుకగా కొత్త అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ అన్లిమిటెడ్ లాభాలతో పాటు అధిక డేటా కోరుకునే యూజర్లకు చక్కగా సరిపోతుంది. ఈ ప్లాన్ ను ఈరోజు నుంచి అందుబాటులో తీసుకొచ్చినట్లు బిఎస్ఎన్ఎల్ అధికారికంగా అనౌన్స్ చేసింది. బిఎస్ఎన్ఎల్ అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్స్ లిస్ట్ లో చేరిన ఈ కొత్త అన్లిమిటెడ్ ప్లాన్ ఏమిటో చూద్దామా.
బిఎస్ఎన్ఎల్ ఈ కొత్త ప్లాన్ ను లాంగ్ వ్యాలిడిటీ మరియు అధిక కోరుకునే యూజర్ల కోసం అందించింది. అదే, బిఎస్ఎన్ఎల్ కొత్తగా ప్రకటించిన రూ. 2,799 వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ బిఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు అంటే, పూర్తిగా ఒక సంవత్సరం చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే సంవత్సరం మొత్తం నిశ్చింతగా ఉండొచ్చు. ముఖ్యంగా, ఈ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ తో డైలీ 3 జీబీ హై స్పీడ్ డేటా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను ఈరోజు నుంచి బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ లిస్ట్ లో చేర్చింది.
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 2,799 ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 365 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. కేవలం వ్యాలిడిటీ మాత్రమే కాదు, ఈ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాల్ మరియు డైలీ 100 SMS ప్రయోజనాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ డైలీ 3 జీబీ హై స్పీడ్ డేటా పూర్తిగా ఒక సంవత్సరం అందిస్తుంది. అంతేకాదు, ఈ డైలీ లిమిట్ ముగిసిన తర్వాత 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా ఆఫర్ చేస్తుంది.
ఈ ప్లాన్ ఈరోజు నుంచి అందుబాటులో వచ్చింది. మీరు ఈ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ ను బిఎస్ఎన్ఎల్ పోర్టలో లిస్ట్ అవుట్ కాలేదు. ఈ ప్లాన్ ను బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ నుంచి లిస్ట్ చేసింది. మేము చెక్ చేసే సమయానికి Phonepe వంటి ఇతర యాప్స్ లో కూడా లిస్ట్ అవుట్ కాలేదు. అంటే, బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ నుంచి మీరు ఈ ప్లాన్ ను పొందవచ్చు.
Also Read: POCO F7 5G పై డబుల్ ధమాకా ఆఫర్స్ అందించిన ఫ్లిప్ కార్ట్.!
మీరు కూడా ఈ కొత్త రూ. 2,799 వన్ ఇయర్ ప్లాన్ తో రీఛార్జ్ చేయాలనుకుంటే బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ నుంచి ఈ ప్లాన్ ను రీచార్జ్ చేయవచ్చు.