BSNL నుండి కొత్త రూ.199 ప్లాన్: డైలీ 2GB హై స్పీడ్ డేటా అందుకోండి

Updated on 10-Jan-2021
HIGHLIGHTS

BSNL మరొక కొత్త ప్లాన్ ను ప్రకటించింది.

ఈ ప్లానుతో డైలీ 2GB హై స్పీడ్ డేటా

ఉచిత SMS లు వంటి మరిన్ని లాభాలను అందిస్తుంది.

BSNL మరొక కొత్త ప్లాన్ ను ప్రకటించింది. అయితే, ఈ కొత్త ప్లాన్ ను ఇప్పటికే అందుబాటులో వున్న 186 రూపాయల ప్లాన్ స్థానంలో ఉంచనుంది. ఈ ప్లానుతో డైలీ 2GB హై స్పీడ్ డేటాతో పాటుగా అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ ఉచిత SMS లు వంటి మరిన్ని లాభాలను అందిస్తుంది.

BSNL కొత్తగా ప్రకటించిన ఈ రూ.199 ప్లాన్ 186 రూపాయల ప్లాన్ స్థానంలో. ఒకేవేళ మీకు ప్రస్తుతానికి ఈ రూ. 186 ప్లాన్ అందుబాటులో వున్నా కూడా, 2021 జనవరి 1 వ తేదీ నుండి  రూ.186 ప్లాన్ స్థానంలో ఈ రూ.199 ప్లాన్ అందుబాటులోకి వస్తుంది. అంటే, రూ.286 ప్లాన్ పూర్తిగా కనుమరుగవుతుంది.

ఈ కొత్త 199 రూపాయల ప్లాను అన్లిమిటెడ్ కాలింగ్ తో వస్తుంది. అయితే, రోజుకు 250 నిముషాలు మాత్రమే చేసుకోవచ్చు. ఈ ప్లాన్ మంచి ప్రయోజనాలను తీసుకొస్తుంది. ఈ ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటా మరియు డైలీ 100 ఉచిత SMS లిమిట్ తో వస్తుంది. BSNL ఇటీవల కూడా 365 రూపాయల మంచి ప్లాన్ ప్రకటించింది. ఈ  పూర్తిగా 1 సంవత్సరం వ్యాలిడిటీ తో వస్తుంది. ఈ ప్లాన్ గురించి పూర్తిగా తెసులుకోవడానికి ఇక్కడ నొక్కండి.          

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :