BSNL: రూ.200 కంటే తక్కువ ఖర్చులో అన్ని ప్రయోజనాలు అందించే టాప్ ప్లాన్స్.!
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బెస్ట్ ప్లాన్స్
రేట్ తక్కువే అయినా ఎక్కువ లాభాలను అందించే ప్లాన్స్
తక్కువ ఖర్చులో అన్ని ప్రయోజనాలు అందించే BSNL టాప్ ప్లాన్స్
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) అతి తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయోజనాలను అందిస్తున్న టెలికం కంపెనీ, అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే, BSNL ఇప్పటికి కూడా చాలా తక్కువ ధరలోనే తన ప్లాన్ లను అఫర్ చేస్తోంది. ఈ ప్లాన్స్ రేట్ తక్కువే అయినా, ఇవి అన్ని ప్రయోజనాలను అఫర్ చేస్తాయి. అందుకే, ఈరోజు రూ.200 కంటే తక్కువ ఖర్చులో అన్ని ప్రయోజనాలు అందించే BSNL టాప్ ప్లాన్స్ గురించి చూద్దాం.
Surveyరూ.200 రూపాయల కంటే తక్కువ ఖర్చులో అధిక లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ లలో రూ. 105, రూ. 107 మరియు రూ. 197 ప్రీపెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. ఈ మూడు బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందించే ప్రయోజనాలను క్రింద చూడవచ్చు.
BSNL Rs.105 Plan
ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ 18 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో 2GB డేటాని కూడా పొందుతారు. ఈ ప్లాన్ తో ఉచిత SMS ప్రయోజనం మాత్రం లభించదు. ఈ ప్లాన్ తో లోకల్ SMS కి 80 పైసలు మరియు నేషనల్ SMS కోసం Rs. 1.20 రేట్ లు వర్తిస్తాయి.
BSNL Rs.107 Plan
రూ.107 ప్రీపెయిడ్ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ యూజర్లకు 35 రోజుల వ్యాలిడిటీ అఫర్ చేస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ తో 200 మినిట్స్ కాలింగ్ మరియు 3GB సౌలభ్యాన్ని కూడా యూజర్లు పొందుతారు. అదనంగా, ఈ రీఛార్జ్ తో 35 రోజులు ఉచిత BSNL Tunes ని కూడా అందుకుంటారు. ఈ ప్లాన్ అతి తక్కువ ధరలో లిమిటెడ్ ప్రయోజనాలతో వచ్చే బెస్ట్ ప్లాన్ గా చెప్పబడుతుంది.
BSNL Rs.199 Plan
బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ చవక రీఛార్జ్ ప్లాన్ ఏకంగా 70 రోజులబ్ చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2GB డేటా మరియు రోజుకు 100 SMS మరియు Zing వినియోగ ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, ఫ్రీ బైస్ అన్ని కూడా (కాలింగ్, డేటా, SMS) కేవలం 15 రోజుల వ్యవధికి మాత్రమే అందుతాయి. అయితే, వ్యాలిడిటీ మాత్రం 70 రోజులకు వర్తిస్తుంది.
మరిన్ని బెస్ట్ BSNL ప్లాన్స్ కోసం Click Here
Raja Pullagura
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile