BSNL Christmas festive offers announced with free data
2025 క్రిస్మస్ సందర్భంగా BSNL తన ప్రీపెయిడ్ యూజర్లకు డైలీ 500MB ఉచిత డేటా అందించే ప్రత్యేక ఆఫర్ ను తీసుకొచ్చింది. అయితే, ఈ ఉచిత డేటా ఆఫర్ ని బిఎస్ఎన్ఎల్ నేరుగా అందించడం లేదు. కొత్తగా ప్రవేశపెట్టిన కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్‌తో రీచార్జ్ చేసుకున్న యూజర్లకు మాత్రమే అదనపు డేటా రూపంలో ఈ ప్రయోజనం అందిస్తుంది. మరి బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ క్రిస్మస్ పండుగ ఆఫర్ ఏమిటి? ఈ ఆఫర్ తో వచ్చే ప్రీపెయిడ్ ప్లాన్స్ ఏవీ? అన్న పూర్తి వివరాలు వెంటనే తెలుసుకోండి.
బిఎస్ఎన్ఎల్ యూజర్లకు ఈ గొప్ప పండుగ కనుక అందించింది. ఈ ఆఫర్ తో కొన్ని రీఛార్జ్ ప్లాన్స్ పై 500MB అదనపు ఉచిత డేటా అందించింది. అయితే, ఈ ఆఫర్ కేవలం వారం రోజులు మాత్రమే అందుబాటులో ఉండే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. ఈ ఆఫర్ డిసెంబర్ 24వ తేదీ నుంచి 2025 డిసెంబర్ 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక ఈ ఆఫర్ తో అదనపు ఉచిత డేటా అందించే ప్లాన్స్ ఏమిటని చూస్తే, ఇందులో రూ. 225, రూ. 347, రూ. 485 మరియు రూ. 2399 వన్ ఇయర్ ప్లాన్ కూడా ఉన్నాయి.
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో ఈ వారం రోజుల లోపు రీఛార్జ్ చేసే యూజర్లకు ఈ ప్రయోజనాలు అందుతాయి. ఈ ప్లాన్ తో అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100SMS ప్రయోజనాలు అందిస్తుంది. అయితే, ముందు 2.5 జీబీ డైలీ హై స్పీడ్ డేటా అందిస్తే, ఇప్పుడు క్రిస్మస్ సీజన్ లో రీఛార్జ్ చేసే యూజర్లకు రోజుకు 3 జీబీ హై స్పీడ్ డేటా ఆఫర్ చేస్తుంది. అంటే, ఇప్పుడు రీఛార్జ్ చేస్తే ఈ లాభాలు మీకు అందుతాయి.
ఈ ర్ రెండు ప్లాన్స్ కూడా అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMS లాభాలు అందిస్తాయి. అలాగే, ముందు 2 జీబీ హై స్పీడ్ డేటా లభిస్తే, ఇప్పుడు క్రిస్మస్ ఆఫర్ లో భాగంగా డైలీ 2.5జీబీ డేటా లభిస్తుంది. వీటిలో రూ. 347 ప్లాన్ 50 రోజులు చెల్లుబాటు అవుతుంది. రూ. 485 ప్రీపెయిడ్ ప్లాన్ మాత్రం 70 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది.
Also Read: Redmi Note 15: స్లీక్ డిజైన్, భారీ బ్యాటరీ, కొత్త చిప్ సెట్ తో ఎంట్రీ కి సిద్ధం.!
రూ. 2399 ప్లాన్ ను నిజంగా జాక్ పాట్ ఆఫర్ అని చెప్పాలి. ఎందుకంటే, ఇది వన్ ఇయర్ ఆఫర్ మరియు ఈ పండుగ ఆఫర్ సమయంలో రీఛార్జ్ చేస్తే 2026 సంవత్సరం మొత్తం డైలీ 2.5 జీబీ హై స్పీడ్ డేటాని ఎంచక్కగా ఎంజాయ్ చేయవచ్చు. ఇదే కాదు సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS వినియోగ సౌకర్యాలతో పూర్తిగా 2026 మొత్తం రీఛార్జ్ గొడవ లేకుండా నిశ్చితంగా ఉండవచ్చు.