bsnl best unlimited plan that offers daily heavy data and unlimited benefits
సంవత్సరం మొత్తం అధిక డేటా అందించే BSNL బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్ కోసం చూసే వారికి బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్ ఒకటి అందుబాటులో ఉంది. ఈ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు సంవత్సరం మొత్తం అనిలిమిటెడ్ లాభాలతో పాటు రోజు మొత్తానికి సరిపోయే అధిక డేటా పొందుతారు. అంటే, ఈ బెస్ట్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు సంవత్సరం మొత్తం నిశ్చితంగా మరియు హ్యాపీగా ఉండొచ్చు. బిఎస్ఎన్ఎల్ అందించిన ఈ బెస్ట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు ఏమిటో చూద్దామా.
బిఎస్ఎన్ఎల్ దేశం మొత్తం 4G నెట్ వర్క్ ను విస్తరించిన తర్వాత చాలా బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా అందించింది. వాటిలో రీసెంట్ గా అందించిన రూ. రూ. 2,799 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఒక బెస్ట్ వన్ ఇయర్ ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్లాన్ సంవత్సరం మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్రీపెయిడ్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ బిఎస్ఎన్ఎల్ ప్లాన్ అందించే పూర్తి బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 2,799 ప్రీపెయిడ్ ప్లాన్ 365 చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజులు అన్లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ చేస్తుంది మరియు రోజుకు 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. ముఖ్యంగా ఈ బిఎస్ఎన్ఎల్ లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ ప్రతిరోజు 3GB హై స్పీడ్ డేటా అందిస్తుంది. ఈ డేటా ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ను 12 నెలలకు లెక్కిస్తే నెలకు కేవలం రూ. 233 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది.
ఇటువంటి లాభాలు మరింత తక్కువ ధరలో కొంచెం తక్కువ ధరలో అందించే మరో ప్రీపెయిడ్ ప్లాన్ కూడా వుంది. అదే, బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 2,399 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ అందించే బెనిఫిట్స్ కూడా ఒకసారి చూద్దాం.
Also Read: కేవలం ఇయర్ బడ్స్ ధరకే Dolby Atmos సౌండ్ బార్ అందుకోండి.!
బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 2,399 ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే మీకు సంవత్సర కాలం పాటు అన్లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజూ 2 జీబీ హై స్పీడ్ డేటా మరియు డైలీ 100 SMS వినియోగ ప్రయోజనం కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తో వచ్చే డైలీ డేటా ముగిసిన తర్వాత, 40Kbps వేగంతో అన్లిమిటెడ్ డేటా ఆఫర్ చేస్తుంది.