BSNL Plan: నెలకు కేవలం రూ. 100 ఖర్చుతో కంప్లీట్ బెనిఫిట్స్ అందించే చీప్ అండ్ బెస్ట్ ప్లాన్ ఇదే.!

Updated on 03-Feb-2025
HIGHLIGHTS

బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ కావాలంటే బిఎస్ఎన్ఎల్ ని ఆశ్రయించాందేల్సిందే

అతి చవక ధరలో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తున్న ఏకైక సంస్థ బిఎస్ఎన్ఎల్

బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఆ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి వివరంగా తెలుసుకోనున్నాము

BSNL Plan: అతి తక్కువ బడ్జెట్ లో అన్ని బెనిఫిట్స్ అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ కావాలంటే బిఎస్ఎన్ఎల్ ని ఆశ్రయించాందేల్సిందే. ఎందుకంటే. టెలికాం ఇండస్ట్రీ మొత్తం మీద అతి చవక ధరలో కంప్లీట్ బెనిఫిట్స్ తో బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తున్న ఏకైక సంస్థ గా బిఎస్ఎన్ఎల్ నిలుస్తుంది. ఈరోజు మనం కూడా బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న ఆ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి వివరంగా తెలుసుకోనున్నాము.

BSNL Plan: ఏమిటా బెస్ట్ బడ్జెట్ ప్లాన్?

బిఎస్ఎన్ఎల్ యూజర్లకు అత్యంత ప్రీతిపాత్రమైన రూ. 1,198 గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది. ఈ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తాన్ని నెల నెల వారీగా లెక్కిస్తే నెలకు రూ. 100 కంటే తక్కువ ఖర్చు అవుతుంది. అయితే, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ సంవత్సరం మొత్తం నెల వారీగా కంప్లీట్ బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

బిఎస్ఎన్ఎల్ రూ. 1,198 ప్లాన్

బిఎస్ఎన్ఎల్ రూ. 1,198 ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తిగా ఒక సంవత్సరం మొత్తం చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో అందించే ప్రయోజనాలు మాత్రం నెల వారీగా అందిస్తుంది. ఈ ప్లోర్న్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు నెలకు 300 లిమిటెడ్ కాలింగ్ మినిట్స్, నెల మొత్తానికి 3GB హై స్పీడ్ డేటా మరియు నెల మొత్తానికి 30 SMS వినియోగ బెనిఫిట్ అందిస్తుంది. ఈ విదంగా 12 నెలల పాటు సంవత్సరం మొత్తం అందిస్తుంది.

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో అందించే ఉచిత బెనిఫిట్స్ లిమిట్ ముగిసిన తర్వాత రెగ్యులర్ రేట్లు వర్తిస్తాయి. అంటే, లోకల్ కాల్ కోసం రూ. 1, STD కాల్ కోసం రూ. 1/ min, లోకల్ SMS కోసం 80p, నేషనల్ SMS కోసం రూ. 1.20 మరియు 1MB డేటా కోసం 25p రేట్లు వర్తింప చేస్తుంది.

Also Read: Google Pixel 8: ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 29 వేల భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది.. ఎక్కడంటే.!

మరిన్ని బెస్ట్ BSNL ప్రీపెయిడ్ ప్లాన్స్ కోసం Click Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :